ఆ ఘనత సాధించిన మూడో ఐటీ కంపెనీగా విప్రో

3 Jun, 2021 15:16 IST|Sakshi

ముంబై: భారత ఐటీ సంస్థ విప్రో గురువారం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రూ.3 ట్రిలియన్ ను తాకింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ తర్వాత ఈ మైలురాయిని సాధించిన మూడవ భారత ఐటీ సంస్థగా విప్రో నిలిచింది. మార్కెట్ ప్రారంభంలో విప్రో స్టాక్ ధర రూ.550 తాకింది. బీఎస్ఈలో అంతకుముందు రోజు రూ.543.05 వద్ద ముగిసింది. ప్రస్తుతం విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.01 ట్రిలియన్. మింట్ నివేదిక ప్రకారం, థియరీ డెలాపోర్ట్ సంస్థ సీఈఓ, ఎమ్ డీగా చేరినప్పటి నుంచి విప్రో స్టాక్ పెరిగింది. డెలాపోర్ట్ నాయకత్వంలో జర్మనీ రిటైలర్ మెట్రో నుంచి ఈ సంస్థ 7.1 బిలియన్ డాలర్ల అతిపెద్ద ఒప్పందాన్ని చేసుకుంది.

భారతదేశంలో మొత్తం దీని పేరిట 13 లిస్టెడ్ సంస్థలు ఉన్నాయి. ఇవి రూ.3 ట్రిలియన్ ఎం-క్యాప్ను దాటాయి. విప్రో ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశం మొత్తంలో 14వ స్థానంలో ఉంది. విప్రో వాటా కేవలం ఒక సంవత్సరంలోనే 157 శాతం పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 40 శాతం పెరిగింది. ఒక నెలలో విప్రో స్టాక్ 11.44 శాతం పెరిగింది. రూ.14.05 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్, రూ.11.58 మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ట్రిలియన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, రూ.8.33 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ భారతదేశంలో అత్యంత విలువైన సంస్థలుగా ఉన్నాయి.

చదవండి: వాట్సాప్ ఉపాయాలు పన్నుతోంది: కేంద్రం

మరిన్ని వార్తలు