Wipro Layoffs 2023: వందల మంది ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన విప్రో!

20 Jan, 2023 17:37 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. పేలవమైన పనితీరు కారణంగా ఫ్రెషర్స్‌ను విధుల నుంచి  తొలగించినట్లు బిజినెస్ టుడే  రిపోర్ట్‌ చేసింది.

(ఇదీ చదవండి: మరో బాంబు, వేలమందికి షాకివ్వనున్న టెక్‌ దిగ్గజం)

ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై విప్రో స్పందించింది. ‘విప్రోలో, మేం అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నందుకు గర్వపడుతున్నాం. సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా, ప్రతి ఎంట్రీ - లెవల్ ఉద్యోగి వారి నియమించబడిన వర్క్‌ ప్లేస్‌లో నిర్దిష్టమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము.

వ్యాపార లక్ష్యాలు, క్లయింట్‌ల అవసరాలు ఉద్యోగుల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. మానిటరింగ్‌, రీట్రైనింగ్‌ వంటి ప్రక్రియల్లో భాగంగా కంపెనీ నుండి కొంతమంది ఉద్యోగుల విభజన చేయాల్సి ఉంటుంది. కాబట్టే ట్రైనింగ్‌ తర్వాత పేలవంగా రాణిస్తున్న ఫ్రెషర్స్‌ను విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని తెలిపింది.  

(స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు)

మరిన్ని వార్తలు