డెనిమ్‌ గ్రూప్‌లో విప్రో వాటా అమ్మకం

4 Jun, 2021 02:43 IST|Sakshi

న్యూఢిల్లీ: స్వతంత్ర అప్లికేషన్‌ సెక్యూరిటీ సంస్థ డెనిమ్‌ గ్రూప్‌లో పూర్తి వాటాను విక్రయించినట్లు ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. వాటాను 22.42 మిలియన్‌ డాలర్ల(రూ. 160 కోట్లు)కు విక్రయించినట్లు తెలియజేసింది. 2018 మార్చిలో డెనిమ్‌ గ్రూప్, మేనేజ్‌మెంట్‌లో 33.33 శాతం వాటాను విప్రో కొనుగోలు చేసింది. ఇందుకు 8.83 మిలియన్‌ డాలర్లను వెచ్చించింది. ఇటీవల కోల్‌ఫైర్‌ సంస్థ డెనిమ్‌ గ్రూప్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో పూర్తి వాటాను విక్రయించినట్లు విప్రో వివరించింది. దీంతో ప్రస్తుతం డెనిమ్‌ గ్రూప్‌ పెట్టుబడుల నుంచి పూర్తిగా వైదొలగినట్లు తెలియజేసింది. కాగా.. మరోవైపు యూఎస్‌కు చెందిన ఐటీ ఇన్సిడెంట్‌ రెస్పాన్స్‌ కంపెనీ స్క్వాడ్‌క్యాస్ట్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందుకు 1.2 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. తద్వారా 20 శాతానికంటే తక్కువ వాటాను సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. జూన్‌      చివరికల్లా ఈ లావాదేవీ పూర్తికానున్నట్లు తెలియజేసింది.  

ఈ వార్తల నేపథ్యంలో విప్రో షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం నీరసించి రూ. 539 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు