ATM Cash Withdraw Using UPI: ఏటీఏం కార్డ్‌ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త!

19 May, 2022 16:06 IST|Sakshi

ఏటీఏం కార్డ్‌ వినియోగదారులకు శుభవార్త. త్వరలో ఏటీఎం కార్డ్‌తో పనిలేకుండా యూపీఐ పేమెంట్‌ ద్వారా ఏటీఏం సెంటర్‌లో ఈజీగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ట్రయల్‌ వెర్షన్‌లో ఉండగా త్వరలో అందరికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని సమాచారం.
 

దేశంలో యూపీఐ పేమెంట్స్‌ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. ముఖ్యంగా కరోనా కారణంగా మునుపెన్నడూ లేని విధంగా యూజర్లు క్యాష్‌ లెస్‌ ట్రాన్సాక్షన్స్‌పై మొగ్గు చూపుతున్నారు. వైరస్‌ వ్యాప్తితో పాటు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా ఉన్న చోటు నుంచి ఆన్‌లైన్‌ ద్వారా మనీ ట్రాన్స్‌ ఫర్‌ చేయడంతో యూజర్లు యూపీఏ పేమెంట్స్‌ చేస్తున్నారు. 

అయితే ఈ నేపథ్యంలో ఏటీఎం సెంటర్‌లలో జరిగే నేరాల్ని అరికడుతూ...యూపీఏ పేమెంట్స్‌ను మరింత పెంచేలా ఎన్సీఆర్‌ కార్పొరేషన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ తొలిసారి యూపీఐ నెట్‌వర్క్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌తో కలిసి ఇంటర్‌ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌ డ్రాల్‌(ఐసీసీడబ్ల్యూ) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని రానుంది. 

ఈ ఫ్లాట్‌ ఫామ్‌తో యూజర్లు కార్డ్‌ లేకుండా ఏటీఎం సెంటర్‌లలో గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌తో పే పాటు ఇతర యూపీఐ పేమెంట్స్‌తో మనీ విత్‌ డ్రాల్‌ చేసుకునే సౌకర్యం ఉంటుందని ఎన్సీఆర్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు తెలిపారు. కార్డ్‌ లెస్‌ మనీ విత్‌ డ్రాల్‌ జరగాలంటే..సంబంధిత బ్యాంక్‌లకు చెందిన ఏటీఎంలలో  ఈ కొత్త యూపీఏ పేమెంట్‌ సదుపాయం ఉండాలని చెప్పారు.  

కార్డ్‌ లేకుండా ఏటీఎం నుంచి మనీ విత్‌ డ్రా ఎలా చేయాలంటే?

ముందుగా ఏటీఎం మెషిన్‌లో విత్‌ డ్రా క్యాష్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి

వెంటనే మీకు యూపీఐ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాలి

అలా ట్యాప్‌ చేస్తే ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్‌ కోడ్‌ డిస్‌ప్లే అవుతుంది

ఆ కోడ్‌ను మీ యూపీఐ పేమెంట్‌(ఉదాహరణకు గూగుల్‌ పే) ను స్కాన్‌ చేసుకోవాలి  

స్కాన్‌ చేస్తే మీరు మనీ ఎంత డ్రా చేయాలనుకుంటున్నాని అడుగుతుంది. మీ అవసరాన్ని బట్టి మనీ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం లిమిట్‌ రూ.5వేల వరకు ఉండనుందని తెలుస్తోంది. 

మీకు ఎంత క్యాష్‌ కావాలో..నెంబర్‌ (ఉదాహరణకు రూ.2వేలు) ఎంట్రీ చేసిన తర్వాత హింట్‌ ప్రాసెస్‌ బటన్‌ క్లిష్‌ చేస్తే మనీ విత్‌ డ్రా అవుతుంది. డీఫాల్డ్‌గా మీ యూపీఐ అకౌంట్‌ క్లోజ్‌ అవుతుంది.

చదవండి👉వాటిని దాటేయనున్న డిజిటల్‌ వాలెట్లు

మరిన్ని వార్తలు