విమానంలో వెర్రి వేషాలు, నిద్ర నటించిన మహిళ ఏం చేసిందంటే?

11 Sep, 2023 19:01 IST|Sakshi

విమానయాన సంస్థ ఇండిగోలో  తోటి  ప్యాసెంజర్‌ పట్ల అభ్యంతరకంగా ప్రవర్తించిన  సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.  విమానంలో మహిళా ప్రయాణికురాలి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ముంబై-గౌహతి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలికి ఈ  చేదు అనుభవం  ఎదురైంది. గత మూడు నెలల్లో ఇది అయిదో కేసు కావడం గమనార్హం. 

ఈ ప్రయాణంలో  క్యాబిన్ లైట్లు ఆర్పింది మొదలు పక్క సీట్లో  ఉన్న ప్రయాణికుడు ఉన్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం స్టార్ట్‌ చేశాడు. చేయి పెట్టుకోవడానికి ఉండే రెస్ట్ హ్యాండిల్ ను పైకి తోసేసి మరీ ఆమెన అభ్యంతరకరంగా తాకాడు. దీంతో సీట్ల మధ్యలోని  హ్యాండిల్ను  మరోసారి కిందకు దించేసింది. అయినా వాడి తీరు మారలేదు. అయితే మరికొంత టైం అతగాడిని పరీక్షిద్దామనుకున్న మహిళ  ఆర్మ్‌రెస్ట్‌ని  తిరిగి కిందకి దించి, నిద్రపోతున్నట్టుగా నటించి, వీడి సంగతేదో చూద్దామనుకుంటూ ఒక కన్నేసి  ఉంచింది. (రిలయన్స్‌ ఇషా అంబానీ మరో భారీ డీల్‌: కేకేఆర్‌ పెట్టుబడులు)

వంకర బుధ్దిని పోనిచ్చుకోని ఆ ప్రయాణికుడు ఆమె నిద్రించిందని భావించి, మళ్లీ తన చేతికి పని చెప్పాడు. ఇక్కడే  ఆ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. కావాలనే చేస్తున్నాడని నిర్ధారించుకన్నా ఆ మహిళ, చిర్రెత్తుకొచ్చి ఒక్కసారిగా లైట్లు ఆన్ చేసి అరవడం ప్రారంభించింది. క్యాబిన్ సిబ్బందికి  ఫిర్యాదు చేసింది. దీంతో దిమ్మదిరిగి బొమ్మ కనపడిన అతగాడు  చేసిన పనికి కాళ్లావేళ్లా పడి క్షమాపణ చెప్పడం ప్రారంభించాడని మహిళ తెలిపింది.  (ఇన్‌ఫ్లేషన్‌ మండుతోంటే..ఈ డ్యాన్స్‌లేంటి? కమలా హ్యారిస్‌పై మండిపాటు )

కానీ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తులో సాయం అందిస్తామని ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది.  

మరిన్ని వార్తలు