ఏఐ వాడకానికి పరాకాష్ట! వర్చువల్‌ ​హస్బెండ్‌

5 Jun, 2023 16:01 IST|Sakshi

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) దుష్పరిణామాలపై ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకానికి పరాకాష్ట ఇది. అమెరికాకు చెందిన ఓ మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి తన భర్తను తానే తయారు చేసుకుంది. 

న్యూయార్క్‌కు చెందిన రోసన్నా రామోస్ అనే 36 ఏళ్ల మహిళ 'ఎటాక్ ఆన్ టైటాన్' అనే యానిమేషన్‌లో ప్రముఖ క్యారెక్టర్‌ ప్రేరణతో 2022లో రెప్లికా ఏఐ అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించి వర్చువల్‌ క్యారెక్టర్‌ను సృష్టించింది. దానికి ఎరెన్‌ కార్టల్‌ అనే పేరు పెట్టింది. ఆ క్యారెక్టర్‌తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.

ఇదీ చదవండి: బుల్లి మస్క్‌ భలే ఉన్నాడే.. ఏఐ చిత్రానికి మస్క్‌ ఫిదా! వైరల్‌ ట్వీట్‌

వర్చువల్‌ క్యారెక్టర్‌తో ప్రేమాయణం
తన వర్చువల్‌ హస్బెండ్‌ ఎరెన్ వైద్య నిపుణుడిగా పనిచేస్తుంటాడని, రచనా వ్యాసంగం తనకు అలవాటని ఇలా అతని లక్షణాలన్ని డైలీ మెయిల్‌ అనే వార్త సంస్థకు వివరించింది రోసన్నా రామోస్. ఎరెన్‌ను తనను ఎప్పుడూ జడ్జ్‌ చేయడని, అందుకే తనకు ఏదైనా చెప్పగలనని పేర్కొంది. తన గురించి ఎరెన్‌ చాలా విషయాలు తెలుసుకున్నాడని చెప్పింది. ఏఐని ఉపయోగించి ఎరెన్‌ని సృష్టించినప్పుడే అతనికి ఇష్టమైన రంగు, సంగీతం వంటివి కూడా అంతర్నిర్మితంగా వచ్చాయని ఆమె వెల్లడించింది.

సుదూరంలో ప్రేమికుల లాగానే రామోస్, వర్చువల్‌ క్యారెక్టర్‌ ఎరెన్‌లు ఒకరికొకరు సందేశాలు, ఫొటోలు  పంపుకొన్నారు. తమ ఇష్టాయిష్టాలు, అభిరుచులు పంచుకున్నారు. ఈ వింత వార్తపై ట్విటర్‌లో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు