స్విగ్గీ అకౌంట్‌తో రూ.97 వేలు మాయం చేశారు - ఎలా అంటే?

21 Feb, 2024 20:02 IST|Sakshi

ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ యాప్ స్విగ్గీ ఖాతాలను హ్యాకింగ్ చేసి ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ నివాసితులైన అనికేత్ కల్రా (25), హిమాన్షు కుమార్ (23) సుల్తాన్‌పూర్‌కు చెందిన ఒక మహిళ స్విగ్గీ అకౌంట్​ను హ్యాక్​ చేసి సుమారు లక్ష రూపాయలు కాజేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇద్దరు సామాన్య డెలివరీ బాయ్స్.. స్విగ్గీ ఖాతాలను హ్యాక్ చేయడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) సిస్టం ఉపయోగించి ఓ మహిళకు ఫోన్ చేసి.. స్విగ్గి అధికారులమని నమ్మించి ఆమె యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటివి తెలుసుకున్నారు. అకౌంట్ డీటైల్స్ తెలుసుకున్న తరువాత సుమారు రూ. 97 వేలు మాయమయ్యాయి.

అకౌంట్ నుంచి భారీగా డబ్బులు కట్ అవుతుండటం గుర్తించిన మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపైన సమగ్ర విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

స్విగ్గీ అకౌంట్స్ హ్యాచ్ చేసి తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించేవారు. వచ్చిన డబ్బును చట్టబద్దమైన లావాదేవీలుగా మార్చుకోవడానికి వారు పనిచేసే మెడికల్ షాపుకు వచ్చిన వ్యక్తులకు ఇచ్చి వారి యూపీఐ ఐడీల ద్వారా తమ అకౌంట్లలో పడేలా చేసుకునే వారు.

whatsapp channel

మరిన్ని వార్తలు