వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఉద్యోగులు, రాకెట్‌ వేగంతో పెరుగుతున్న ఇళ్ల ధరలు!

26 May, 2022 19:14 IST|Sakshi

ప్రపంచ దేశాల్లో ఆయా రంగాలకు చెందిన ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ కారణంగా ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగించడంతో ఆ ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై పడింది. దీంతో  రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హౌసింగ్‌ మార్కెట్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.


నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్స్‌ రీసెర్చ్‌ (ఎన్‌బీఈఆర్‌) ప్రకారం.. 2019 నుంచి నవంబర్‌ 2021 వరకు సేకరించిన డేటాలో 42.8శాతం మంది అమెరికన్‌ ఉద్యోగులు పార్ట్‌ టైమ్‌, ఫుల్‌ టైమ్‌ వర్క్‌ ఫ్రమ్‌ నుంచే పనిచేస్తున్నారు. అదే సమయంలో శాస్వతంగా ఇంటి వద్ద నుంచి పనిచేయడం కనిపిస్తోంది.  

అయితే అదే (2019-2021) సమయంలో అమెరికాలో రికార్డ్‌ స్థాయిలో ఇళ్ల రేట్లు పెరిగాయి. వేగంగా ఇళ్ల రేట్లు 23.8శాతం పెరగడంతో ఇళ్లకు భారీ ఎత్తున డిమాండ్‌  ఏర్పడింది. డిమాండ్‌ తో ఇళ్ల ధరలు, ఇళ్ల రెంట్లు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. 

రెడ్‌ ఫిన్‌ ఏం చెబుతుంది
రెడ్‌ ఫిన్‌ డేటా సైతం అమెరికా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఫిభ్రవరిలో ఆన్‌లైన్‌లో 32.3శాతం మంది తాము ఉంటున్న ప్లేస్‌ నుంచి మరో ప్లేస్‌కు మారేందుకు కొత్త ఇళ్లకోసం వెతికారని నివేదించింది. వారి సంఖ్య 2019లో 26శాతం ఉండగా  2021 తొలి క్యూ1లో వారి సంఖ్య 31.5శాతానికి పెరిగింది. ఇక ఇళ్లు షిప్ట్‌ అయ్యే వారిలో అమెరికాలో మియామి,ఫియోనిక్స్‌ తో పాటు పలు ప్రాంతాల ప్రజలు రీలొకేట్‌ అయినట్లు రెడ్‌ఫిన్‌ తన నివేదికలో ప్రస్తావించింది.

మరిన్ని వార్తలు