-

గృహ ఆదాయాలే కీలకం లేకపోతే .. అంతే సంగతులు..! ప్రపంచ బ్యాంకు కీలక వ్యాఖ్యలు..!

7 Oct, 2021 20:33 IST|Sakshi

భారత ఎకానమీపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ బ్యాంకు..!

గృహ ఆదాయాలు పెరిగితేనే...భారత ఎకానమీ పునరుద్దరణ..!

గత నాలుగు సంవత్సరాల నుంచి భారత జీడీపీ వృద్ది రేటు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కరోనా రాకతో జీడీపీ వృద్ధి రేటు భారీగా పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరంలో -7.96 శాతం వృద్ది రేటును భారత్‌ను నమోదు చేసింది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. జీడీపీ గ్రోత్‌ రేట్‌ 12 శాతం మేర పడిపోయింది. 

2021-2022 జీడీపీ రేటు 8.3 శాతం..!
తాజాగా ప్రపంచ బ్యాంకు భారత ఎకానమీపై కీలక వ్యాఖ్యలను చేసింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ 8.3 శాతం నమోదుచేస్తోందని గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో  ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. భారత్‌ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి 20.1 శాతంగా నమోదుచేసింది. కరోనా రాకతో దేశ వ్యాప్త  లాక్‌డౌన్‌ కారణంగా మునుపటి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మునుపెన్నడూ లేని విధంగా జీడీపీ 24.4 శాతం మేర తగ్గింది. 
చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్‌ డాలర్లు వారి సొంతం..!

గృహ ఆదాయాలే కీలకం లేకపోతే .. అంతే సంగతులు..!
కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌తో సతమతమైనా భారత జీడీపీ వృద్దిరేటుపై ప్రపంచ బ్యాంకు తన నివేదికలో...కరోనా వ్యాక్సినేషన్‌, వ్యవసాయ, కార్మిక సంస్కరణలు, గృహ ఆదాయాల(నెలసరి, వార్షిక ఆదాయాలు) పెరుగుదల వంటి అంశాలు భారత జీడీపీ పెరుగుదలను నిర్ణయిస్తోందని పేర్కొంది.  గృహా ఆదాయాల్లో రికవరీ ఉంటేనే..భారత ఎకానమీ పునరుద్దరణ ఉంటుందని తెలిపింది.

గృహా ఆదాయాల్లో పెరుగుదల కన్పిస్తేనే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది దీంతో జీడీపీ పెరుగుదలలో మార్పు కన్పిస్తోందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. ఏదేమైనా,  భారత్‌లో వివిధ రంగాలలో ఆర్థిక పునరుద్ధరణ అసమానంగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. తయారీ, నిర్మాణ రంగాలు 2021 లో స్థిరంగా కోలుకున్నప్పటికీ, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులు, మహిళలు, స్వయం ఉపాధి వ్యక్తులు, చిన్న సంస్థలు వెనుకబడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దాంతో పాటుగా దక్షిణాసియా దేశాల్లో అనేక ఆర్థిక  రంగాల్లో లింగ అసమానతలు భారీగా పెరిగిందని ప్రపంచ బ్యాంకు చీఫ్‌ ఎకనామిస్ట్‌ హన్స్‌ టిమ్మెర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి: ఎలన్‌ మస్క్‌ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు