ఉక్రెయిన్‌కు ప్రపంచ బ్యాంక్ భారీ ఆర్ధిక సహాయం

8 Mar, 2022 20:22 IST|Sakshi

వాషింగ్టన్‌: గత కొద్ది రోజులుగా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే యూకే పీఎం బోరిస్ జాన్సన్ 100 బిలియన్ డాలర్ల సాయం ప్రకటిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రపంచ బ్యాంక్ కూడా ఉక్రెయిన్‌కు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది. అందులో భాగంగా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఉక్రెయిన్‌ కోసం 723 మిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఆర్థిక అత్యవసర పరిస్థితి నుంచి బయటపడేందుకు సప్లిమెంటరీ బడ్జెట్​ సపోర్ట్​ ప్యాకేజీకి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.

ప్యాకేజీలో 350 మిలియన్​ డాలర్లు అనుబంధ రుణం, 139 మిలియన్​ డాలర్లు గ్యారెంటీ, 134 మిలియన్​ డాలర్లు గ్యాంట్​ ఫైనాన్సింగ్​, 100 మిలియన్​ డాలర్లు ఫైనాన్సింగ్​ కోసం నిధులుగా కేటాయించారు.ఈ ప్యాకేజీ ఉక్రేనియన్ ప్రజలకు కీలకమైన సేవలను అందించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. ఈ నగదును ఆసుపత్రి కార్మికులకు వేతనాలు, వృద్ధులకు పెన్షన్లు, నిస్సహాయులకు సామాజిక కార్యక్రమాలు కోసం వినియోగించనున్నారు. 

(చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే!)

మరిన్ని వార్తలు