సంచలనం, వంట నూనెతో అద్భుతం..కుకింగ్‌ ఆయిల్‌తో కాస్ట్లీ విమానం నడిపారు!

1 Apr, 2022 16:27 IST|Sakshi

సీట్లు నిండినా..గల్లా ఖాళీ అవుతుంది ఇదీ ప్రస్తుతం విమానయాన పరిస్థితి. అందుకే విమానాయన సంస్థలు ఆవ నూనె, వంట నూనెతో విమానాల్ని నడిపేందుకు ప‍్రయత్నాలు మొదలు పెట్టాయి. మంచి ఫలితాల్ని రాబడుతున్నాయి. తాజాగా 496 మంది ప్రయాణించే కాస్ట్లీ విమానం 'ఎయిర్‌ బస్‌ ఏ380'లో వంటింట్లో వాడే వంట నూనె ఫ్యూయల్‌గా ఉపయోగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండానే విమానం నిర్దేశించిన ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా టేకాఫ్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.   

గాలి నుంచి కాదు ఆవ మొక్క నుంచి ఇంధనం


ఐదేళ్ల క్రితం గాలి నుంచి విమానం ఇంధనం తయారవుతుందని అనడంతో విమానయానం కష్టాలు ఇక తీరిపోయినట్లేనని భావించారు. ఎందుకంటే అసలు విమానయానం కష్టాలన్నీ ఇంధనం వల్లనే జరుగుతున్నాయి. నానాటికి పెరిగిపోతున్న చమురు ధరలతో..వాటి ఖర్చు ఆకాశం నుంచి అంతరిక్షం దాటుతోంది. దాంతో ఆల్ట్రనేటీవ్‌  ఫ్యూయల్‌ వైపు అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ అదెందుకో కార్యచరణకు నోచుకోలేదు. కానీ గతేడాది భారత శాస్త్రవేత్త,జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పునీత్‌ ద్వివేదీ బృందం ఆవాల మొక్క ద్వారా విమానం ఇంధనం తయారవుతుందనగానే ఆశలు చిగురించాయి. బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసే నూనెతో విమానం ఇంధనం తయారు చేయోచ్చని పునీత్ ద్వివేది తెలిపారు. ద్వివేదీ గత 4 సంవత్సరాలుగా దీనిపై పరిశోధనలు చేస్తుండగా..ఈ ప్రాజెక్టును15 మిలియన్ల డాలర్లతో అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ చేపట్టింది.

వంట నూనెతో అద్భుతాలు


ఈ నేపథ్యంలో సీఎన్‌ఎన్‌ కథనం ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాన ప్రయాణాన్ని ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిర్ బస్‌ ఏ380 ఫ్లైట్‌ను ఫ్రాన్స్‌లో ట్రయల్స్‌ నిర్వహించారు. సంచలనం ఏంటంటే ఈ విమానంలో వంటింట్లో వాడే వంటనూనె ( ఇది సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(saf అని కూడా పిలుస్తారు)ను ఉపయోగించడం. ఈ విమానం రోల్స్ రాయిస్ ట్రెంట్ 900 ఇంజన్ సాయంతో మార్చి 25న టౌలౌస్‌లోని బ్లాగ్నాక్ విమానాశ్రయం నుండి బయలుదేరింది.  మార్చి 29న టౌలౌస్ నుండి నైస్‌కు వెళ్లేందుకు అదే నూనెను ఉపయోగించి ఏ380 ప్లైట్‌ను మరో ట్రైల్‌ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇంధన పనితీరు బాగున్నట్లు గుర్తించారు.   

ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ ఎనర్జీస్‌ సంస్థ

ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ ఎనర్జీస్‌ సంస్థ  'హైడ్రోప్రాసెస్డ్ ఎస్టర్స్, ఫ్యాటీ యాసిడ్స్' లేదా హెచ్‌ఈఎఫ్‌ఏ నుండి ఈ ప్రత్యేకమైన కుకింగ్‌ ఆయిల్‌ను తయారు చేసింది.  ఇక‍్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఆయిల్‌ను విమానాల్లో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. మార్చి2021లో వైడ్ బాడీ ఏ 350 ఫ్లైట్‌లో, గత అక్టోబర్‌లో ఏ319 నియో అనే విమానంలో ఈ ఆయిల్‌ను ఫ్యూయల్‌గా ఉపయోగించారు. తాజాగా కాస్ట్లీ విమానం ఏ380 లో ఉపయోగించి టెస్ట్‌ ట్రయల్స్‌ ను విజయవంతంగా పూర్తించారు. కాగా ఎయిర్‌బస్ యాజమాన్యం తన విమానాలన్నింటిలో ఈ కుకింగ్‌ ఆయిల్‌ను ఉపయోగించేందుకు సర్టిఫికేట్‌ పొందాలని చూస్తుంది. అప్పటి వరకు ప్రయోగాలు కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 

చదవండి: ఈ విమానంలో జర్నీ బాగా కాస్ట్లీ గురూ!

మరిన్ని వార్తలు