ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్‌ తయారీ కంపెనీ...భారత్‌కు గుడ్‌బై..! కారణం అదే..?

18 Apr, 2022 20:05 IST|Sakshi

ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్‌ తయారీ కంపెనీ హోల్సిమ్‌ గ్రూప్‌ (హోల్డర్‌ఇండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌- Holcim Group) భారత్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. కంపెనీ గ్లోబల్‌ స్ట్రాటజీలో భాగంగా..భారత్‌ నుంచి తమ వ్యాపారాలకు స్వస్తి పలుకుతూ కోర్‌ మార్కెట్లపై హోల్సిమ్‌ గ్రూప్‌ దృష్టి సారించనున్నట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. 

గత పదిహేడుళ్లుగా హోల్సిమ్‌ గ్రూప్‌ భారత్‌ మార్కెట్లలో తమ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇక హోల్సిమ్‌ గ్రూప్‌కు చెందిన రెండు లిస్టెడ్‌ కంపెనీలోని వాటాలను కూడా విక్రయించేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్‌ గ్రూప్‌..అంబుజా సిమెంట్‌, ఎసీసీ సిమెంట్‌ కంపెనీల్లో వాటాలను కల్గి ఉంది. అంబుజా సిమెంట్స్‌లో 63.19 శాతం, ఎసీసీ కంపెనీలో 4.48 శాతం వాటాలను హోల్సిమ్‌ గ్రూప్‌ కల్గి ఉంది. హోల్సిమ్‌ గ్రూప్‌ తీసుకున్న నిర్ణయంతో సిమెంట్‌ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఆయా రంగ నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

ఇరు కంపెనీల వాటాలను అదానీ గ్రూప్స్‌, జెఎస్‌డబ్య్లూ సిమెంట్‌ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  వాటాల విక్రయంతో రుణ భారం తగ్గించుకోవాలని హోల్సిమ్‌ గ్రూప్‌ చూస్తోంది. అలాగే కొనుగోళ్ల ద్వారా పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫైడ్ చేసుకోవాలని భావిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో హోల్సిమ్ గ్రూప్ తన బ్రెజిలియన్ యూనిట్‌ను సుమారు ఒక బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఇక భారత్‌లో పాటుగా జింబాబ్వేలోని వ్యాపారాలను కూడా విక్రయించేందుకు సిద్దమైన్నట్లు సమాచారం. 

కారణం అదే..!
హోల్సిమ్‌ గ్రూప్‌ ఆయా దేశాల నుంచి నిష్క్రమించేందుకు సిద్దమవుతోంది. స్పెషాలిటీ బిల్డింగ్ సొల్యూషన్స్, హై ఎండ్ ఎనర్జీ ఎఫిసియెంట్ రెనోవేషన్స్ వంటి విభాగాలపై హోల్సిమ్ గ్రూప్ ఫోకస్ చేయనుంది. ‘స్ట్రాటజీ 2025 ఆక్సల్రెటింగ్‌ గ్రీన్‌ గ్రోత్‌ ప్రోగాం’లో భాగంగా ఆయా దేశాల నుంచి నిష్క్రమించేందుకు హోల్సిమ్‌ గ్రూప్‌ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా కంపెనీ డిసెంబర్ 2021లో మలర్కీ రూఫింగ్ ఉత్పత్తులను, 2021 ప్రారంభంలో ఫైర్‌స్టోన్ బిల్డింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసింది.

చదవండి: విలీన బాటలో దిగ్గజ ఐటీ కంపెనీలు?

>
మరిన్ని వార్తలు