‘డిజిటల్‌ ఇండియా ఇన్‌సైడ్‌’ నినాదం మార్మోగాలి!

3 May, 2022 09:38 IST|Sakshi

బెంగళూరు: దేశీయంగా సెమీకండక్టర్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రాచుర్యం పొందిన చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్‌ నినాదం ’ఇంటెల్‌ ఇన్‌సైడ్‌’  తరహాలో ’డిజిటల్‌ ఇండియా ఇన్‌సైడ్‌’  నినాదం ప్రపంచంలో మార్మోగాలని ఆయన పేర్కొన్నారు.

సెమీకండక్టర్ల తయారీపై డెల్, సోనీ వంటి సంస్థలు డిజిటల్‌ ఇండియా ఆర్‌ఐఎస్‌సీ–వీ (డీఐఆర్‌–వీ) ప్రోగ్రామ్‌లో కలిసి పనిచేస్తున్నాయని చంద్రశేఖర్‌ చెప్పారు. డీఐఆర్‌–వీ కింద దేశీయంగా తయారైన తొలి చిప్‌సెట్‌ను 2023–24 నాటి కల్లా వ్యాపార అవసరాల కోసం అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు   వివరించారు.  

మరిన్ని వార్తలు