గిన్నిస్‌ బుక్‌లోకి వైట్‌ పెయింట్‌.. కరెంట్‌ సేవ్‌తో పాటు ఏసీలను మించే చల్లదనం!!

19 Sep, 2021 13:29 IST|Sakshi

గ్లోబల్‌ వార్మింగ్‌, పర్యావరణపు ప్రతికూల మార్పుల వల్ల..  వాతావరణంలో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీజన్‌తో సంబంధం లేకుండా అధిక వేడిమి సమస్య భూమిని పట్టి పీడిస్తోంది.  ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం సమ్మర్‌తో  సంబంధం లేకుండా ఎయిర్‌ కండిషనర్‌ల వాడకం మన దేశంలోనూ పెరిగిపోతోంది.  ఈ క్రమంలో ఊరట ఇచ్చే వార్తను చెప్పారు సైంటిస్టులు. 


ఇండియానా(యూఎస్‌ స్టేట్స్‌)లోని పుర్‌డ్యూ యూనివర్సిటీ సైంటిస్టులు.. ప్రపంచంలోనే అత్యంత తెల్ల పెయింట్‌ను తయారు చేశారు. ఇది గనుక గోడలకు వేస్తే.. ఇంట్లో చల్లదనం కోసం కరెంట్‌ను కాల్చుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అంతేకాదు ఫ్రియాన్‌ విడుదల తప్పి.. గ్లోబల్‌ వార్మింగ్‌ సమస్య కూడా నివారించొచ్చని అంటున్నారు.
 

ప్రపంచంలోనే అత్యంత తెల్ల పెయింట్‌ను పుర్‌డ్యూ యూనివర్సిటీ సైంటిస్టులు రూపొందించారు. ఇది తాజాగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది కూడా.  ఇది సూర్యకాంతికి రిఫ్లెక్షన్‌ను దూరం చేస్తుందని ప్రొఫెసర్‌ గ్జియూలిన్‌ రువాన్‌ చెప్తున్నారు.  

గ్లోబల్‌ వార్మింగ్‌పై ఫైట్‌.. 
గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించేదిశగా ఈ వైట్‌ పెయింట్‌ పరిశోధన కృషి చేయనుందని రువాన్‌ అంటున్నారు.  అత్యంత తెల్లదనం కారణంగానే ఇది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కిందని చెప్తున్నారాయన.  ఈ పెయింట్‌ను గనుక వెయ్యి స్క్వేర్‌ ఫీట్ల మేర గోడకుగానీ, రూఫ్‌కుగానీ వేస్తే..  పది కిలోవాట్ల కరెంట్‌ అందించే చల్లదనాన్ని అందిస్తుందట. ఇది ఇళ్లలోని ఏసీలు అందించే చల్లదనం కంటే చాలా రెట్లు ఎక్కువని రువాన్‌ స్పష్టం చేశారు. తద్వారా ఎయిర్‌ కండిషనర్ల వాడకం తగ్గడంతో పాటు గ్లోబల్‌ వార్మింగ్‌ చాలావరకు తగ్గించినట్లే అవుతుందని అంటున్నారు.

ఎలాగంటే..
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పెయింట్స్‌ చల్లదనానికి బదులు.. వేడిని కలగజేస్తాయి. తెల్ల పెయింట్స్‌ 80 నుంచి 90 శాతం సూర్యకాంతిని రిఫ్లెక్ట్స్‌ చేస్తాయి. ఎలాంటి చల్లదనాన్ని అందించవు.  కానీ, పుర్‌డ్యూ సైంటిస్టులు రూపొందించిన వైట్‌ పెయింట్‌ మాత్రం రివర్స్‌లో అతిచల్లదనాన్ని అందిస్తాయి. కాస్మోటిక్స్‌లో ఉపయోగించే కెమికల్‌ కాంపౌండ్‌, అధిక గాఢత బేరియం సల్ఫేట్‌ కలిపి ఈ పెయింట్‌ను డెవలప్‌ చేశారట. ధర కూడా తక్కువగా ఉండి.. ఎక్కువకాలం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది మార్కెట్‌లోకి రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఒకవేళ ఈ పెయింట్‌ గనుక మార్కెట్‌లోకి వస్తే మాత్రం ఎయిర్‌ కండిషనర్స్‌ అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

చదవండి: సెల్‌ఫోన్‌ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..!

మరిన్ని వార్తలు