ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ విడుదల

10 Jun, 2021 14:20 IST|Sakshi

తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్‌ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్‌.. ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ ‘ఆర్‌ఓజీ ఫ్లో ఎక్స్‌ 13’ను అభివృద్ధి చేసింది. దీంతో పాటు ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో కూడిన జిఫిరస్‌ సిరీస్‌లో మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. 13 అంగుళాలతో ఏఎండీ రైజెన్‌ 5900హెచ్‌ఎస్, 5900హెచ్‌ఎక్స్‌ ప్రాసెసర్లతో కూడిన ఆర్‌ఓజీ ఫ్లో ఎక్స్‌ 13 ల్యాప్‌టాప్‌ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌ఓజీ జెఫిరస్‌ డ్యూయో 15 ఎస్‌ఈ, జీ14, జీ15 మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌ల ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతాయని పేర్కొంది. 

ఆసుస్ ఆర్‌ఓజీ ఫ్లో ఎక్స్‌ 13 విండోస్ 10 ల్యాప్‌టాప్ మీ రోజువారీ అవసరాల కోసం 13.4 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఏఎమ్ డీ ఆక్టా కోర్ రైజెన్ 9 5900 హెచ్‌ఎస్ ప్రాసెసర్ ఉంది, దీనితో పాటు 16 జిబి ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డి స్టోరేజ్ ఉంది. గ్రాఫిక్స్ కార్డ్ విషయానికొస్తే, ఇందులో ఎన్విడియా జిఫోర్స్ ఆర్టిఎక్స్ 1650 గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. ఇది 1.3 కిలోల బరువు ఉంటుంది. దీని ధర భారతదేశంలో 1,19,990 రూపాయలు. 

చదవండి: 

వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్‌ ఆఫర్‌!

మరిన్ని వార్తలు