టీవీలన్నింటిల్లో ఇది స్పెషల్ టీవీ‌.. కింద నుంచి పైకి

4 Mar, 2021 05:08 IST|Sakshi

ఇప్పటివరకూ చాలా టీవీలను చూసుంటారు.. మరి ఇలాంటిది.. అబ్బే చాన్సే లేదు.. ఫొటోలు చూస్తున్నారుగా.. అలా బటన్‌ నొక్కగానే.. అండర్‌గ్రౌండ్‌లో నుంచి స్తంభంలాంటిది పైకి వస్తుంది.. నెమ్మదిగా అది ఐదు 4కే మైక్రో ఎల్‌ఈడీ ప్యానళ్లుగా విడిపోతుంది. చివరికి 165 అంగుళాల భారీ టీవీ మీ హాల్లో ఠీవిగా ప్రత్యక్షమవుతుంది. ఆస్ట్రియాకు చెందిన సీ సీడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ తయారుచేసిన ఈ టీవీ పేరు ఎం1. ఇది ప్రపంచంలోనే తొలి 165 అంగుళాల ఫోల్డబుల్‌ టీవీ. హాల్లో అలా ఫ్లోర్‌లోంచి టీవీ పైకి రావడం వంటివి చూసి.. మీ ఇంటికి వచ్చినోళ్లు నోరెళ్లబెట్టడం ఖాయమని ‘సీ సీడ్‌’ కంపెనీ చెబుతోంది. పైగా.. ప్రస్తుత ఓఎల్‌ఈడీలతో పోలిస్తే.. ఈ మైక్రో ఎల్‌ఈడీల్లో క్లారిటీ అదిరిపోవడం ఖాయమంటోంది. ఇంతకీ రేటెంతో చెప్పలేదు.. రూ.2.91 కోట్లే!!.. టీవీ కొనకముందే.. నోరెళ్లబెట్టేశారా.. ఇది జస్ట్‌ టీవీ రేటే.. ఆ అండర్‌గ్రౌండ్‌ సెట్టింగ్‌.. వాటన్నిటికీ అయ్యే ఇన్‌స్టలేషన్‌ చార్జీలు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివర్లో డెలివరీలు మొదలుపెడతామని కంపెనీ చెబుతోంది.. ఓసారి ట్రై చేస్తారా ఏమిటి?? 

మరిన్ని వార్తలు