ప్రపంచంలో ఎతైన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసా?

24 Sep, 2021 17:23 IST|Sakshi

ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. అయితే, ఈవీ కొనుగోలుదారులను ప్రధానంగ వేధించే ప్రశ్న ఏదైనా ఉంది అంటే? అది మౌలిక సదుపాయాల కల్పన అని చెప్పుకోవాలి. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ కంపెనీలు, రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. మౌలిక సదుపాయాల సమస్యలను తగ్గించడానికి లడఖ్ పరిపాలన కేంద్ర పాలిత ప్రాంతంలోని స్పితి జిల్లాలో ఉన్న కాజాలో ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కనీసం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఛార్జింగ్ చేసుకోవచ్చు.

కాజా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్‌డీఎం) మహేంద్ర ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. "ప్రస్తుత ప్రపంచంలోనే ఎతైన ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ కాజాలో ఉంది. ఇది ఇక్కడ మొదటి స్టేషన్. ఈ స్టేషన్ కు మంచి స్పందన లభిస్తే, మరిన్ని స్టేషన్లు ఏర్పాటు చేస్తాము. ఇది వాహన కాలుష్యాన్ని తనిఖీ చేయడానికి కూడా సహాయపడుతుంది" అని అన్నారు. ఈ రోజు ఇద్దరు మహిళలు ఎలక్ట్రిక్ వాహనంపై మనాలి నుంచి కాజాకు వచ్చారు. వాయు కాలుష్యం పెరగడం వల్ల ఈ రోజుల్లో వాతావరణం అకస్మాత్తుగా మారుతోంది. వాహనాల నుంచి వచ్చే వాయువుల ఉద్గారం ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి అని ఆయన అన్నారు.(చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ రికార్డు)

మరిన్ని వార్తలు