ప్రపంచంలో అత్యంత ఖరీదైన కప్ ఐస్‌క్రీమ్‌ ధర ఎంతో తెలుసా?

20 Jul, 2021 18:13 IST|Sakshi

ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టపడని వారుండరూ. ఒకప్పుడు సీజనల్ గా కనిపించే ఈ ఐస్‌క్రీమ్‌ లు ఇప్పుడు ఎవర్‌ గ్రీన్ గా మారాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా డైరీ సంస్థలు నోరూరించే విభిన్న రకాల ఐస్‌క్రీమ్‌లను అందిస్తున్నాయి. క్రీమ్ స్టోన్ వంటి స్టోర్లలో వీటి ధర చాలా ఎక్కువగానే ఉంటుంది. ఫేమస్ ఐస్‌క్రీమ్‌ స్టోర్లలో వీటి ధర రూ.500, రూ.1000 పైగా ఉంటుంది. అయితే, ఒక స్కూప్ ఐస్‌క్రీమ్‌ ధర తులం బంగారం కంటే ఎక్కువ ఖర్చవుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? మీరు విన్నది నిజమే. ట్రావెల్ వ్లాగర్ షెనాజ్ ట్రెజరీ ఇటీవల ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ కోసం దుబాయ్ కు వెళ్ళింది. 

అక్కడ ఒక స్కూప్ ఐస్‌క్రీమ్‌ ధర 840 డాలర్లు(సుమారు రూ.60,000) ఖర్చవుతుంది. ఇది మనకు తెలిసిన వెనీలా ఐస్‌క్రీమ్‌ లాంటిది కాదు, ఎందుకంటే దీనిని తాజా వెనీలా బీన్స్ ఉపయోగించి తయారు చేస్తారు. కుంకుమ పువ్వు, బ్లాక్ ట్రఫుల్స్ మాత్రమే కాకుండా 23 క్యారెట్ల తినదగిన బంగారం ఇందులో ఉంటుంది. బ్లాక్ డైమండ్ అని పిలిచే ఈ ఐస్‌క్రీమ్‌ ను వెర్సేస్ గిన్నెలో అందిస్తారు. వ్లాగర్ షెనాజ్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో దాదాపు నిమిషం నిడివి గల దీనికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఐస్‌క్రీమ్‌ ను ఉచితంగా ఇచ్చినట్లు తన వీడియోలో పేర్కొంది. దుబాయ్ లోని జుమేరా రోడ్ లోని ఈ కేఫ్ బంగారంతో నిండిన లాట్టీని అందిస్తుంది. ఒక కప్పు లాటే 23 క్యారెట్ల బంగారు ఆకు ఉదారమైన పొరతో పొరలుగా ఉంటుంది. చాలా మంది దీనిపై రకరకాలుగా స్పందిస్తుంది. ఒక యూజర్ ఇక్కడ నాలుగు సార్లు రూ.60,000 ఖర్చు చేసి తిన్నట్లు పేర్కొన్నాడు.

A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury)

మరిన్ని వార్తలు