కొత్త రికార్డు సృష్టించిన షియోమి

20 Nov, 2020 11:21 IST|Sakshi

2020 మొబైల్ తయారీ దారులకు కష్టతరమైన సంవత్సరం. కోవిడ్ మహమ్మారి వల్ల లాక్‌డౌన్ విధించడంతో ఫోన్ యొక్క అమ్మకాలు బాగా క్షిణించాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మొబైల్ రంగం కొంచెం కుదుటపడింది. ఏదేమైనా, ఈ దీపావళి సీజన్ నుండి మొబైల్ రంగం తిరిగి పుంజుకుంటుంది. ఎంఐ ఇండియా ఈ దీపావళి సీజన్ లో13 మిలియన్ పరికరాలను విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం, పండుగ అమ్మకాలలో 9 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లే ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లలో ఎంఐ 10 టి ప్రో, రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్, రెడ్‌మి నోట్ 9 ప్రో, రెడ్‌మి 9 ప్రైమ్ రెడ్‌మి 9, రెడ్‌మి 9ఎ వంటి మోడళ్లు ఎక్కువగా అమ్ముడైనట్లు పేర్కొంది.(చదవండి: గూగుల్ మ్యాప్స్ లో మరో సరికొత్త ఫీచర్)

ఈ పండుగ అమ్మకాలలో పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు గణనీయమైన డిమాండ్ ఉందని తెలిపింది. టీవీలు, స్ట్రీమింగ్ డివైజ్‌లు, ట్రిమ్మర్లు, స్మార్ట్ బ్యాండ్స్, ఆడియో ఉత్పత్తులు, పవర్ బ్యాంక్స్ తదితర 4 మిలియన్ డివైజ్‌లను విక్రయించినట్టు వివరించింది. బెస్ట్ సెల్లర్ల జాబితాలో ఇటీవలే లాంచ్ చేసిన ఎంఐ వాచ్ రివాల్వ్, ఎంఐ స్మార్ట్ స్పీకర్లు ఉన్నట్టు పేర్కొంది. ఎంఐ బాక్స్ 4కె, ఎంఐ టీవీ స్టిక్‌లకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ సెల్లింగ్ స్ట్రీమింగ్ డివైజ్‌లుగా నిలిచినట్టు తెలిపింది. ఈ సంవత్సరం 4కె టివిల వృద్ధిలో అతిపెద్ద డిమాండ్ ఉందని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్ పరిమాణాలు గల 50/55-అంగుళాల టీవీలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే 50 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
 

మరిన్ని వార్తలు