Xiaomi: ఎన్నాళ్ళీ.. నిరీక్షణ..! ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీలో షావోమీకి భంగపాటు!

31 Jul, 2022 21:14 IST|Sakshi

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ ఆటోమొబైల్‌ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 2024కల్లా మార్కెట్‌లో తన తొలి ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేయాలని ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. కానీ ఈ ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. కార్ల తయారీ కోసం డ్రాగన్‌ కంట్రీ పర్మీషన్‌లు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని సమాచారం.

బిజింగ్‌ కేంద్రంగా షావోమీ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ ఏర్పాటు కోసం స్థలం చూసుకుంది. కానీ ఆ సంస్థ ఏర్పాటు కోసం కావాల్సిన అనుమతుల్ని నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిప్మార్‌ కమిషన్ అధికారులు  ఇచ్చేందుకు సుముఖంగా లేరని, నెలల తరబడి సంబంధిత శాఖ అధికారుల్ని సంప్రదించినా పట్టించుకోవడం లేదని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

షావోమీకి కష్టమే 
వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. షావోమీ తన ప్రత్యర్ధులతో పోటీ పడుతూ ఈవీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఆటోమొబైల్‌ మార్కెట్‌లో వినియోగదారులకు కావాల్సిన ఈవీ వెహికల్స్‌ను అదించాలని, అతిపెద్ద ఈవీ మార్కెట్‌గా అవతరిస్తుందని ఆశించాం. కానీ లైసెన్స్‌ పొందడంలో ఆలస్యం అవుతుందని.. ఇలాగే కొనసాగితే షావోమీ ప్రత్యర్ధులు మార్కెట్‌లో రాణిస్తారని ఆ సంస్థ సీఈవో లీ జున్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు