ఇంటి పనుల్లో సాయం చేసే సైబర్‌డాగ్‌

11 Aug, 2021 13:56 IST|Sakshi

CyberDog : బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌గా ఎంటరై మార్కెట్‌ లీడర్లకే ముచ్చెమటలు పట్టించిన షావోమీ మరో సంచలనానికి తెర లేపింది. బడా కంపెనీలకే సాధ్యం కాని దానిని సుసాధ్యం చేసింది. నిత్య జీవితంలో ఉపయోపడే రోబోలను సైతం తయారు చేసి మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసేందుకు రెడీ అయ్యింది.

క్వాడ్రుపెడ్‌
టెక్నాలజీ, ఇంజనీరింగ్‌లో తనకు తానే సవాల్‌ విసురుకుంది. మార్కెట్లో ఉన్న మిగిలిన కంపెనీలు విస్మయం చెందే తీరులో సైబర్‌ డాగ్‌ పేరుతో క్వాడ్రుపెడ్‌ రోబోని తయారు చేసింది. నాలుగు కాళ్లపై నడిచే ఈ రోబోకి సంబంధించిన కీలక అంశాలను ఎంఐ ప్యాడ్‌ 5 రిలీజ్‌ సందర్భంగా షావోమీ వెల్లడించింది.

సైబర్‌డాగ్‌ స్పెషాలిటీస్‌
ఇంట్లో మనుషులకు పనుల్లో సహాయకారిగా ఉండేలా ఈ సైబర్‌డాగ్‌ని షావోమీ రూపొందించింది. కచ్చితత్వానికి మరో పేరుగా ఈ క్వాడ్రుపెడ్‌ పని చేస్తుందంటూ షావోమీ ట్వీట్‌ చేసింది. ఇంటెల్‌ రియల్‌ సెన్స్‌కి ప్రాసెసర్‌ని ఇందులో ఉపయోగించారు. ఈ క్వాడ్రపెడ్‌ రోబో సెకనుకి 3.2 మీటర్లు కదులుతుంది. గరిష్టంగా 3 కేజీల బరువు మోయగలదు. నివిడియా సూపర్‌ కంప్యూటర్‌ శ్రేణికి చెందిన చిప్‌సెట్‌ అమర్చారు.

కేవలం వెయ్యి మాత్రమే
ప్రయోగాత్మకంగా తొలుత కేవలం వెయ్యి సైబర్‌ డాగ్‌ రోబోలను తయారు చేయాలని షావోమీ నిర్ణయించింది. తొలుత వీటిని చైనాలో విడుదల చేసి అక్కడ వచ్చిన స్పందన ఆధారంగా ఇతర దేశాల్లో అందుబాటులోకి తేనుంది. ఈ క్వాడ్రుపెడ్‌ రోబో ధర చైనా మార్కెట్లో 9,999 యువాన్లుగా ఉంది. మన కరెన్సీలో రూ. 1,14,737 ఉండవచ్చని అంచనా.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు