అదిరిపోయే షావోమీ ఎలక్ట్రిక్ కార్‌.. ఒక్క ఫుల్‌ చార్జ్‌తో 1000 కి.మీ మైలేజ్

13 Mar, 2023 21:58 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కారు గురించి ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. షావోమీ వచ్చే ఏడాది ప్రారంభంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనం విడుదలతో పాటు ఉత్పత్తి పెంచుతున్నట్లు తెలిపింది. 

ఇటీవల చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశంలో షావోమీ సీఈవో లీ జున్ ఈవీ కార్ల తయారీ, పెట్టుబడుల గురించి మాట్లాడారు. అయితే షావోమీ తయారు చేసే కారు ఎలా ఉంటుందో చెప్పేలా షావోమీ కార్ల ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. కానీ ధరపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయినప్పటికీ ఆ ఫోటోల్ని బట్టి చూస్తుంటే కారు మెక్‌లారెన్ 720ఎస్ మాదిరిగానే కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 

దీంతో పాటు పెద్ద విండ్‌షీల్డ్, మంచి సైడ్ గ్లాస్ ఏరియా, పనోరమిక్ సన్‌రూఫ్‌, చక్రాల మధ్యలో షావోమీ లోగో, విండ్‌షీల్డ్ పైన కూర్చునే సెన్సార్ కూడా ఉంది. షావోమీ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,000 కి.మీ వరకు ప్రయాణించగలదని ఆటోమొబైల్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈవీ దాదాపు 260 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల 800 వోల్ట్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ కారు గురించి తెలుసుకునేందుకు వాహనదారులు మక్కువ చూపుతున్నారు. 

మరిన్ని వార్తలు