REDMI Note 10: ఐదుసార్లు పెంపు..ఇప్పుడు ధర ఎంతంటే?

29 Aug, 2021 10:47 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ దిగ్గజం షావోమి మరోసారి రెడ్​మీ నోట్ 10ను ధరను పెంచింది. రెడ్​మీ నోట్ సిరీస్‌ అంటే మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆ సిరీస్‌ విడుదలైన ప్రతీసారి ఆ ఫోన్‌ కొనుగోలు కోసం యూజర్లు ఎంతో ఇంట్రస్ట్‌ చూపిస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి 16న రెడ్‌మీ నోట్‌ 10ను విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు  ఐదుసార్లు ఈ ఫోన​ ధరను షావోమి  పెంచింది.  మొత్తంగా ఐదు నెలల కాలంలో ఈ ఫోన్‌ ధర రెండు వేల రూపాయలు పెరిగింది. కరోనా కారణంగా  ప్రపంచ వ్యాప్తంగా చిప్‌ల తయారీ తగ్గిపోయింది. దీంతో స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిపై చిప్‌ల కొరత ప్రభావం పడుతోంది. ఫలితంగా ఫోన్ల ధరలు పెంచేందుకు స్మార్ట్‌ తయారీ కంపెనీలు వెనుకాడటం లేదు.
చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్‌ ఫోన్‌, ఫీచర్లు లీకయ్యాయి

అప్పుడు రూ. 11,999లకే 

రెడ్‌మీ నోట్‌ 10 మార్కెట్‌లోకి వచ్చినప్పుడు 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఇప్పుడు ధర పెరిగిన అనంతరం ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గానూ ఉంది. ఈ రెండు వేరియంట్ల ధర రూ.500 మేర పెరిగింది.

రెడ్​మీ నోట్ 10 ఫీచర్స్‌ 

నెట్‌వర్క్ టెక్నాలజీ  : జీఎస్‌ఎం / హెచ్‌ఎస్‌పీఏ
లాంచ్‌ డేట్‌               : మార్చి 4 
డైమన్షన్‌                    : 160.5 x 74.5 x 8.3 మిల్లీమీటర్‌ (6.32 x 2.93 x 0.33 అంగుళాలు)
వెయిట్‌                     : 178.8 గ్రాములు  
బిల్డ్‌                           : ఫ్రంట్‌ గ్లాస్‌ (గొరిల్లా గ్లాస్ 3), ప్లాస్టిక్ బ్యాక్, ప్లాస్టిక్ ఫ్రేమ్
సిమ్‌                          : సిమ్ డ్యూయల్ సిమ్ (నానో-సిమ్, డ్యూయల్ స్టాండ్-బై)
డిస్‌ ప్లే                       : సూపర్ ఆమ్లోడ్‌, 450 నిట్స్ (టైప్), 1100 నిట్స్ (పీక్)
సైజ్‌                          : 6.43 అంగుళాలు, 99.8 cm2 (83.5% స్క్రీన్-టు-బాడీ రేషియో )
రిజల్యూషన్               :1080 x 2400 పిక్సల్స్, 20: 9 రేషియో 
ప్రొటెక్షన్                   : కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3
ఓఎస్‌                         : ఆండ్రాయిడ్ 11, MIUI 12.5
చిప్‌సెట్                    : క్వాల్‌కామ్ SDM678 స్నాప్‌డ్రాగన్ 678 (11 nm)
సీపీయూ                    : ఆక్టా కోర్ (2x2.2 GHz క్రియో 460 గోల్డ్ అండ్‌ 6x1.7 GHz క్రియో 460 సిల్వర్)
జీపీయూ                    :  అడ్రినో 612
మెమరీ కార్డ్ స్లాట్       :  మైక్రో ఎస్‌డీఎక్స్‌సీ 
ఇంటర్నల్‌                 :  64జీబీ 4జీబీ RAM, 128జీబీ 4జీబీ ర్యామ్‌, 128జీబీ 6జీబీ ర్యామ్‌ 
 క్వాడ్                         :  కెమెరా 48 ఎంపీ,ఎఫ్‌ /1.8, 26ఎంఎం 
సెల్ఫీ                         : కెమెరా సింగిల్ 13 ఎంపీ, ఎఫ్‌/2.5

మరిన్ని వార్తలు