షియోమీ సూపర్.. 8 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్

31 May, 2021 20:15 IST|Sakshi

చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షియోమీ మరో సంచలనానికి సిద్దం అయ్యింది. ఇప్పటికే సరికొత్త టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకోస్తూ షియోమీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. షియోమీ మరో రెండు కొత్త చార్జింగ్ టెక్నాలజీలను విడుదల చేసింది. వీటిలో 200వాట్ హైపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కాగా, మరొకటి 120వాట్ వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ. కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం.. 200వాట్ హైపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ సహయంతో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ గల ఫోన్ ని కేవలం 8 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ చేయనున్నట్లు పేర్కొంది. 

అలాగే, 120వాట్ వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌తో అదే సామర్ధ్యం గల బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా షియోమీ షేర్ చేసింది. ఈ చార్జింగ్ సామర్థ్యానికి తగట్లు మార్పులు చేసిన ఎంఐ 10 ప్రోను 10 శాతం చార్జింగ్ కావడానికి సమయం పడితే, 50 శాతం చార్జింగ్ కావడానికి 8 నిమిషాలు, 100 శాతం చార్జింగ్ కావడానికి 19 నిమిషాలు పట్టింది. అయితే ఈ టెక్నాలజీని స్మార్ట్ ఫోన్ల కోసం ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో తెలియదు. షియోమీ గతంలో 120వాట్ వైర్డ్, 80వాట్ వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీలను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: 

ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్

మరిన్ని వార్తలు