షావోమి నుంచి వస్తున్న స్టైలిష్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలుసా!

28 Nov, 2022 18:42 IST|Sakshi

ఆధునిక కాలంలో యువకుల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ప్రాడెక్ట్‌ వాడకంపై ఆసక్తి చూపుతుంటారు. అయితే మిగిలిన వాటితో పోలిస్తే ఈ కొత్తదనం 'మొబైల్స్' లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో మొబైల్స్ విడుదల చేస్తుంటాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'షియోమీ' (Xiaomi) మార్కెట్లో కొత్త మొబైల్ '13 సిరీస్‌' లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే లాంచ్ డేట్ కూడా ప్రకటించింది. ఈ ఫోన్‌ని 2022 డిసెంబర్ 01 న చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో కంపెనీ 'షియోమీ 13' 'షియోమీ 13 ప్రో' అనే రెండు మోడల్స్ ఉన్నాయి. 

త్వరలో విడుదలకానున్న కొత్త 'షియోమీ 13 సిరీస్‌' అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. మొత్తానికి ఈ సంవత్సరం చివరిలో మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం..  స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో లైకా బ్రాండెడ్ సెన్సార్లు ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇది రన్ అవుతుంది. షావోమి 13 Pro 12GB ర్యామ్‌తో రానున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా హ్యాండ్‌సెట్ 2k రిజల్యూషన్‌తో 6.7 ఇంచెస్ సామ్‌సంగ్‌ ఈ6 అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. 

షావోమీ కొత్త సిరీస్ రెండు రకాల ర్యామ్ లతో రావచ్చని రూమర్ల ద్వారా తెలిసింది. అవి 8 GB, 12GB,అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 128GB, 256GB, 512GB వరకు జత చేసుకోవచ్చు.  ఇక కెమెరా విషయానికొస్తే.. కెమెరా సిస్టమ్ 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో జత చేయబడిన 50MP సోనీ IMX989 ప్రైమరీ సెన్సార్,  రెండవ 50MP టెలిఫోటో లెన్స్‌ను పొందుతుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా అందుబాటులో ఉంటుంది. చివరగా బ్యాటరీ విషయానికి వస్తే, Xiaomi 13 సిరీస్ 4,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కాగా Xiaomi 13 Pro 120watt ఫాస్ట్ ఛార్జింగ్‌ పొందవచ్చు. 

చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా!

మరిన్ని వార్తలు