రెడ్‌ మీ నుండి ఫస్ట్‌ ల్యాపీ.. ఎలా ఉందో తెలుసా?

3 Aug, 2021 12:10 IST|Sakshi

Xiaomi First Laptop: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ షియోమీ నేడు తొలిసారి రెడ్​మీ ల్యాప్‌ట్యాప్‌ లను మార్కెట్‌లో విడుదల చేయనుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌ల వినియోగం పెరిగి పోతుండడంతో ఆయా టెక్‌ సంస్థలు  వినియోగదారులకు అనుగుణంగా గాడ్జెట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. యూజర్లను అట్రాక్ట్‌ చేస్తున్నాయి. 

తాజాగా, షియోమీ సంస్థ 'రెడ్‌ మీ బుక్‌' పేరుతో  రెండు మోడళ్లను ల్యాప్‌ ట్యాప్‌లను విడుదల చేస్తున్నట్లు అధికారంగా ప్రకటించింది. గతేడాది రెడ్‌ మీ బ్రాండ్‌ పేరుతో భారీ ఎత్తున పవర్‌ బ్యాంక్స్‌, ఇయర్‌ బడ్స్‌, స్మార్ట్‌ బ్రాండ్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది స్మార్ట్‌ టీవీలను లాంఛ్‌ చేసింది. ఇప్పుడు అదే బ్రాండ్‌ పేరుతో ల్యాప్‌ ట్యాప్‌లను విడుదల చేయడం టెక్‌ మార్కెట్‌లో ప్రాధాన్యతను సంతరించుకుంది. 

రెడ్‌ మీ బుక్‌ ల్యాప్‌ ట్యాప్‌ ఫీచర్స్‌ 

ప్రస్తుతం ఉన్న విండోస్‌ - 10 తో పాటు త్వరలో అప్‌ డేట్‌ కానున్న విండోస్‌ -11ను అప్ గ్రేడ్‌ చేసుకునే విధంగా రెడ్‌ మీ బుక్‌ ల్యాప్‌ట్యాప్‌ ను డిజైన్‌ చేశారు. దీంతో పాటు 15 అంగుళాల స్క్రీన్‌ సైజ్‌, 1920*1080 పిక్సెల్స్‌ రెజెల్యూషన్‌తో ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, వెబ్‌ క్యామ్‌ కోసం లైట్‌ బెజెల్స్‌ను ఏర్పాటు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, వీ 5.0 బ్లూటూత్‌, సీ టైప్‌ 3.1యూఎస్‌బీ, యూఎస్‌బీ టైప్‌ -ఏ,యూఎస్‌ బీ 2.0, ఆడియో జాక్‌, రెండు స్టెరో స్పీకర్స్‌ ఉన్నాయి. 

ఈ ల్యాప్‌ ట్యాప్‌లో మరో ఇంట్రస్టింగ్‌ ఫీచర్‌ ఏంటంటే ఇంటెల్‌ లెవెన్త్‌ జనరేషన్‌ లో ఐ3,ఐ5 ప్రాసెసర్‌ తో పనిచేయనుంది. 8జీబీ ర్యామ్‌, 512జీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్ (ఎస్‌ఎస్‌డీ), 65 వాట్ల ఛార్జర్‌, ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే  10 గంటల పాటు వినియోగించుకోవచ్చేని రెడ్‌ మీ పేర్కొంది. 

కాస్ట్‌ ఎంత ఉండొచ్చు

ప్రస్తుతం ల్యాప్‌ ట్యాప్‌ స్పెసిఫికేషన‍్లు అందుబాటులోకి వచ్చినా ధరపై షియోమీ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. టెక్‌ నిపుణులు మాత్రం రెడ్‌ మీ బుక్‌ ల్యాప్‌ ట్యాప్‌లు రూ.50వేల లోపు ఉంటాయని అంచనా వేస్తున్నారు.   


 

మరిన్ని వార్తలు