ల్యాప్‌ ట్యాప్‌ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ బ్రాండ్‌ బాగుంటుందంట

22 Jul, 2021 14:58 IST|Sakshi

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌లో మనీ ఎర్నింగ్‌ కోసం మంచి ల్యాప్‌ట్యాప్‌ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?! మనకి డెల్‌,హెచ్‌పీ,లెనెవో, ఆసుస్‌ ల్యాప్‌ ట్యాప్‌ల గురించి మాత్రమే తెలుసు. అయితే మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ల్యాప్‌ట్యాప్‌..పై వాటికంటే బాగుంటుందని టెక్‌ నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ రెడ్ మీ లేటెస్ట్‌ గా  5జీస్మార్ట్‌ ఫోన్లు రెడ్‌ మీ నోట్‌ 10 ఫ్యామిటీ, షియోమీ రెడ్‌ నోట్‌మీ 10టీ విడుదల చేసి వినియోగదారుల్ని అట్రాక్ట్‌ చేస్తుంది. అయితే త్వరలో షియోమీ సంస్థ రూ.13,999వేరియంట్‌ తో స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస‍్తోంది. ఆ స్మార్ట్‌ ఫోన్‌ తో పాటు పవర్‌ బ్యాంక్స్‌, రెడ్‌ మీ ఆడియో, స్మార్ట్‌ టీవీ, ఫిట్‌నెస్‌ బ్రాండ్‌ 'రెడ్‌మీబూ' పేరుతో ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేయనున్నట్లు షియోమీ రియల్‌ మీ ఇం‍డియా సీఈఓ మురళికృష్ణన్‌ తెలిపారు. అయితే దీని స్పెసిఫికేషన్‌ ఎలా ఉన్నాయనే విషయంపై చర్చించలేదు. త‍్వరలోనే ఇండియాలో విడుదల చేస్తున్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది. 

షియోమి ల్యాప్‌ ట్యాప్‌లు
షియోమి ల్యాప్‌ ట్యాప్‌లను విడుదల చేయడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో రెడ్‌మి నోట్‌బుక్‌14 హారిజోన్,రెడ్‌మి నోట్‌బుక్‌14 (ఐసి), రెడ్‌మి నోట్‌బుక్‌14, రెడ్‌మి నోట్‌ బుక్‌ 14 ఇ-లెర్నింగ్ ల్యాప్‌ట్యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు, రెడ్‌మీ నోట్‌బుక్‌ ప్రో14, రెడ్‌మి నోట్‌బుక్‌ అల్ట్రా15 అనే రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేయడం ద్వారా కంపెనీ తన ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు మరింత విస్తృతంగా జరిపేందుకు యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.రాబోయే ల్యాప్‌టాప్‌లు రెడ్‌మిబుక్‌ ప్రో 14 రీబ్రాండెడ్ వెర్షన్లుగా భావిస్తున్నారు. మరి త్వరలో విడుదల కానున్న రెడ్‌మీబూ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది.  

చదవండి: ఇన్‌ స్టాగ్రామ్‌,ఈ సూప‌ర్‌ ఫీచర్‌ గురించి మీకు తెలుసా?!


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు