షియోమి నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్

9 Dec, 2020 15:04 IST|Sakshi

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ 2021 ఏడాదిలో ఎంఐ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే కొత్తగా రాబోయే ఈ ఫోన్ ఫీచర్స్ గురుంచి గత కొంత కాలంగా పుకార్లు చాలా వస్తున్నాయి. ఈ రూమర్ల ప్రకారం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రాబోయే మొట్ట మొదటి షియోమీ ఇదేనని తెలుస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం వచ్చే నెలలో దీనిని విడుదల చేయడమే కాకుండా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని సమాచారం. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌తో రానుంది. ఎంఐ 11 ఫోన్‌లో ఫుల్ హెచ్‌డి ప్లస్ స్క్రీన్ రిజల్యూషన్‌తో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు.

ఎంఐ 11 ప్రో వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2కే రిజల్యూషన్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఎంఐ 11 4,780ఎమ్ఏహెచ్ బ్యాటరీ 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రానున్నట్లు సమాచారం. అదేవిదంగా, ఎంఐ 11ప్రోలో 4,970ఎమ్ఏహెచ్ బ్యాటరీ 100వాట్ సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కంపెనీ సొంత MIUI 12పై నడవనుంది. ఈ ఫోన్‌ 35 నిమిషాల్లో 0 నుండి 100% వరకు ఛార్జ్ చేయగలదని సమాచారం. ఈ ఫోన్లలో 6వ తరం ఆర్టిఫిషల్ ఇంజిన్, సరికొత్త హెక్సాగాన్ కో-ప్రాసెసర్, హయ్యర్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రా ISP, క్వాల్‌కామ్ అడ్రినో జీపీయు వంటి వాటిని అందించనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ 11 గతేడాది లాంచ్ అయిన ఎంఐ 10కు తర్వాతి వెర్షన్ గా ఇది రానుంది. షియోమీ వచ్చే ఏడాది లాంచ్ చేయబోయే అద్భుతమైన ఉత్పత్తి ఇదేనని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు