షియోమీ ప్రియులకి గుడ్‌న్యూస్!

29 Jan, 2021 20:15 IST|Sakshi

షియోమీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా ఎంఐ 11 మొబైల్ విడుదల తేదీని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎంఐ 11ను ఫిబ్రవరి 8న గ్లోబల్ లాంచ్ కి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. గత నెలలో చైనాలో ఎంఐ 10కి కొనసాగింపుగా ఎంఐ 11ను విడుదల చేశారు. డిసెంబరులో ఆవిష్కరించబడిన ఫ్లాగ్‌షిప్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888తో వచ్చిన మొదటి మోడల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ రికార్డు సృష్టించింది. దీనిలో షియోమీ కొత్త ఎంఐయుఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంను తీసుకోనురానున్నట్లు సమాచారం.

ఎంఐ 11 ఫీచర్స్:
డ్యూయల్ నానో సిమ్ ఎంఐ 11 ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంతో పని చేయనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో 6.8-అంగుళాల 2కే డబ్ల్యూక్యూహెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పాటు 8జీబీ లేదా 12జీబీ ర్యామ్ ను తీసుకోని రానున్నారు. ఎంఐ 11లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

షియోమీ ఎంఐ 11లో 256జీబీ యుఎఫ్ఎస్3.1 స్టోరేజ్‌ను అందించనున్నారు. ఈ ఫోన్ లో ఎంఐ టర్బోచార్జ్ 55 డబ్ల్యూ వైర్డ్, 50 డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేసే 4,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ వి5.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, ఇన్‌ఫ్రారెడ్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి. 

ఎంఐ 11 ధర:
గ్లోబల్ మార్కెట్ షియోమీ ఎంఐ 11 ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ చైనాలో కోసం సిఎన్‌వై3,999 (సుమారు రూ.45,300)కి లాంచ్ చేశారు. ఎంఐ 11 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్ సిఎన్‌వై 4,299 (సుమారు రూ.48,700)కి, టాప్-ఆఫ్-లైన్ 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ ఆప్షన్ సిఎన్‌వై4,699(సుమారు రూ.53,200) ధరను కలిగి ఉంది.

మరిన్ని వార్తలు