ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్ వీడియో లీక్

14 Feb, 2021 16:05 IST|Sakshi

ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీకి చెందిన ఎంఐ 11 అల్ట్రా మొబైల్ వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఆ మొబైల్ కు సంబందించిన డిజైన్, స్పెసిఫికేషన్లు వివరాలు ఉన్నాయి. ఎంఐ 11 సిరీస్‌లో తీసుకునివచ్చే టాప్ ఎండ్ మోడల్ ఇదే అయ్యే అవకాశం ఉంది. షియోమీ కంపెనీ మాత్రం ఎంఐ 11 అల్ట్రాకు సంబందించి ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. దీనిలో 120ఎక్స్ అల్ట్రా పిక్సెల్ ఏఐ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తుంది.
 
ప్రముఖ టెక్ బఫ్ యూట్యూబర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఎంఐ 11 అల్ట్రాలో రెండు వేరియంట్లు రానున్నట్లు తెలిపారు. బ్లాక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. దీని కెమెరా మాడ్యూల్ కూడా చాలా పెద్దగా ఉంది. వీడియోలో మనం గమనిస్తే వెనకవైపు ఫోన్‌లో సగభాగాన్ని కెమెరా మాడ్యూలే ఆక్రమించింది. దీంతోపాటు వెనక కెమెరా మాడ్యూల్‌లో చిన్న డిస్ ప్లే కూడా ఉంది. దీని సాయంతో వెనక కెమెరాలో కూడా సెల్ఫీలు తీసుకోవచ్చు. అలాగే మొబైల్ స్క్రీన్ కూడా కనబడుతుంది.

ఎంఐ 11 అల్ట్రా లీకైన ఫీచర్స్:
డిస్‌ప్లే: 6.8-అంగుళాల ఓఎల్ఈడి డిస్‌ప్లే
రిఫ్రెష్ రేట్: 120 హెర్ట్జ్‌
బ్యాటరీ: 5,000
ఫాస్ట్ ఛార్జింగ్: 67వాట్ వైర్డ్, 67వాట్ వైర్‌లెస్, 10వాట్ రివర్స్ ఛార్జింగ్
ర్యామ్: 12జీబీ 
స్టోరేజ్: 256జీబీ
ప్రాసెసర్:  స్నాప్‌డ్రాగన్ 888 
బ్యాక్ కెమెరా: 50ఎంపీ + 48ఎంపీ + 48ఎంపీ 
సెల్ఫీ కెమెరా: 20 ఎంపీ 
ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 
కలర్స్: బ్లాక్, వైట్

చదవండి:

ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు

ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు