ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో రాబోయే ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు

1 Jul, 2021 20:35 IST|Sakshi

ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజాలలో ఒకటైన షియోమీకి చెందిన ఎంఐ 11 మొబైల్ ఇంకా అన్నీ దేశాలలో విడుదల అయ్యిందో కాలేదో గాని అప్పుడే తదుపరి తరం మొబైల్ ఎంఐ 12పై అనేక పుకార్లు బయటకి వస్తున్నాయి. ఈ పుకార్ల ప్రకారం.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 895 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. మన మానవుడి కంటి సామర్థ్యమే 576 మెగాపిక్సల్ అలాంటిది ఎంఐ 12 మొబైల్ లో 200 మెగాపిక్సల్ అంటే కొంచెం అతిశయోక్తిగా ఉంది. పుకార్ల ప్రకారం అయితే ఈ ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 

గత ఏడాది డిసెంబర్ నెలలో చైనాలో తీసుకొచ్చిన ఎంఐ 11లో ఫ్లాగ్ షిప్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చింది. ప్రపంచంలో మొదటిసారి స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వచ్చిన మొబైల్ కూడా షియోమీ(ఎంఐ 11) కంపెనీకి చెందినదే. తర్వాత రాబోయే ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో తదుపరి క్వాల్ కామ్ నుంచి రాబోయే ప్రాసెసర్ తీసుకొచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. చైనీస్ టిప్ స్టార్ షేర్ చేసిన వివరాల ప్రకారం.. షియోమీ కొత్తగా తీసుకొని రాబోయే ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ఎస్ఎమ్8450 అనే పేరుతో పిలిచే ప్రాసెసర్ తీసుకొస్తునట్లు తెలుస్తుంది. ఆ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 895 లేక కొత్తగా ప్రకటించిన స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ అని విషయం పూర్తిగా తెలియదు.

16-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నిక్
స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ అనే ప్రాసెసర్, 888 ప్రాసెసర్ కంటే చాలా శక్తివంతమైనది. ఎంఐ 12లో శామ్ సంగ్, ఒలంపస్ నుంచి రాబోయే 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. ఈ పుకార్ల ప్రకారం 16-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ అనే టెక్నిక్ ద్వారా 200-మెగాపిక్సెల్ కెమెరా అవుట్ పుట రానుంది. అంటే 12 మెగాపిక్సల్ సామర్ధ్యమే(12*16 =192 మెగాపిక్సల్). ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్ లో ఒలంపస్ లోగో కూడా ఉండవచ్చు. ఇది అడ్రినో 730 జీపీయు, క్వాడ్-ఛానల్ ఎల్ పీడీడీఆర్5 ర్యామ్ సపోర్ట్ రానున్నట్లు తెలుస్తుంది. 

చదవండి: State Bank Day: పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం

మరిన్ని వార్తలు