షావోమీ నుంచి అదిరిపోయే మడత ఫోన్‌, శాంసంగ్‌కు దెబ్బే!

10 Aug, 2022 13:00 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ ఆగస్ట్‌ 11న (గురువారం) సెకండ్‌ జనరేషన్‌ ఫోల్డబుల్‌ (మడత ఫోన్‌) ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేయనుంది. 'షావోమీ మిక్స్‌ ఫోల్డ్‌2' పేరుతో గతంలోనే విడుదల కావాల్సి ఉండుగా..కోవిడ్‌ నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తుంది. ఈ తరుణంలో గురవారం ఫోల్డబుల్‌ ఫోన్‌ను యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు షావోమీ ప్రతినిధులు తెలిపారు. 

గత కొన్నేళ్లుగా శాంసంగ్‌ ఫోల్డబుల్ ఫోన్‌ మార్కెట్‌లో సత్తా చాటుతుంది. కానీ మిక్స్ ఫోల్డ్ 2తో ఈక్వేషన్ త్వరగా మారే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ కంటే షావోమీ ఫోన్‌ ధర తక్కువ ఉంటే 

షావోమీ సైతం శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ తరహాలో ఈ మిక్స్‌ ఫోన్‌2 ఫోన్‌లో ఆల్ట్రా థిన్‌ స్క్రీన్‌తో వస్తుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస‍్తున్నారు. హై రిఫ్రెష్‌ రేట్‌తో   ఈ ఫోన్‌ స్క్రీన్‌లు యూజర్లను అట్రాక్ట్‌ చేయనున్నాయి. 

ఫ్లాగ్‌ షిప్‌ వెర్షన్‌ కాపోయినప్పటికీ పవర్‌ ఫుల్‌ హార్డవేర్‌ యూనిట్‌గా పేరొందిన స్నాప్‌ డ్రాగన్‌ 8జనరేషన్‌ 1 చిప్‌ సెట్‌తో రానుంది. 

షావోమీ ఫోల్డబుల్‌ ఫోన్‌ స్లీక్‌ డైమన్షన్‌ (పాలిష్డ్‌ స్మూత్‌ గ్లాస్‌)తో హైక్వాలిటీ డిస్‌ప్లే ఉందని షావోమీ విడుదల చేసిన ఫోన్‌ టీజర్‌ను చూస్తే అర్ధం అవుతుంది. 

ఆగస్టు 10న (నేడు) శాంసంగ్‌ కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌4ని ఆవిష్కరించనుంది. రేపు షావోమీ మిక్స్‌ ఫోల్డ్‌ 2ని విడుదల చేస్తుండడం ఈ ఫోన్‌ మరి ఆసక్తిని రేకెత్తిస్తుంది.    

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ 4జనరేషన్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తుంది. ఇప్పటికే ఫోల్డబుల్‌ ఫోన్‌ విభాగంలో మార్కెట్‌ను శాసిస్తున్న శాంసంగ్‌కు పోటీగా ఒప్పో, షావోమీలు ఫోల్డబుల్‌ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి.

చదవండి👉 వన్‌ఫ్లస్‌ నుంచి మడత ఫోన్‌.. త్రీ ఫోల్డ్స్‌, ఇక గెలాక్సీకి గట్టి పోటీనే!

మరిన్ని వార్తలు