షియోమీ లవర్స్ కి గుడ్ న్యూస్ 

18 Dec, 2020 20:22 IST|Sakshi

షియోమీ తన సొంత ప్లాట్‌ఫామ్‌లో నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్‌ను నిర్వహిస్తోంది. నేటి(డిసెంబర్ 18) నుండి డిసెంబర్ 22 వరకు ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఎయిర్ ప్యూరిఫైయర్, స్మార్ట్ వాచ్, బ్యాక్‌ప్యాక్, స్మార్ట్‌ఫోన్లు ఇంకా మరిన్ని ఉత్పత్తులపై కంపెనీ 4,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్‌లో షియోమీ రెడ్‌మి నోట్ 9 ప్రో రూ.13,999కు లభిస్తుంది. షియోమి నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్ సందర్భంగా ఎంఐ నోట్‌బుక్ 14 హారిజన్ ఎడిషన్‌ను రూ.9 వేల తగ్గింపుతో రూ.50,999కు పొందవచ్చు. కంపెనీ తన ఎంఐ వాచ్ రివాల్వ్‌ను 9,999 రూపాయలకు అందిస్తోంది. గతంలో దీని ప్రారంభ ధర రూ.15,999కు లభించింది. ఫిట్‌నెస్ వాచ్‌లో 10 స్పోర్ట్స్ మోడ్‌లు, బాడీ ఎనర్జీ మానిటరింగ్, జిపిఎస్ సపోర్ట్, 1.39-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉన్నాయి. షియోమీ తన 10,000ఎంఏహెచ్ ఎంఐ వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌పై రూ.700 తగ్గింపుతో 1,999 రూపాయలకు లభిస్తుంది. ఈ పవర్ బ్యాంకు 10వాట్ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఉత్పత్తిపై ఈ సేల్‌లో తగ్గింపును ప్రకటించింది.(చదవండి: అమెజాన్ లో మరో కొత్త సేల్

మరిన్ని వార్తలు