టెక్ దిగ్గజం ఆపిల్‌ను దాటేసిన షియోమీ

6 Sep, 2021 15:03 IST|Sakshi

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ వేరబుల్ స్మార్ట్ బ్రాండ్ అమ్మకాల విషయంలో టెక్ దిగ్గజం ఆపిల్‌ను దాటేసింది. 2021 రెండవ త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్ వాచ్ షిప్ మెంట్ల పరంగా ప్రపంచంలో టాప్ వేరబుల్ సంస్థగా షియోమీ నిలిచింది. దీనికి సంబంధించిన నివేదికను కానాలిస్ సంస్థ విడుదల చేసింది. ఎంఐ తన స్మార్ట్ బ్యాండ్ 6 లాంచ్ చేసిన తర్వాత రెండవ త్రైమాసికంలో షియోమీ అమ్మకాలు ఊపందుకున్నాయి. చైనాలో విక్రయాల విషయానికి వస్తే క్యూ2లో 8.0 మిలియన్ యూనిట్లను రవాణా చేసి 2.6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.(చదవండి: గూగుల్‌ డ్రైవ్‌ వాడుతున్నారా? ఇది మీకోసమే..)

చైనాలో షియోమీ మార్కెట్ వాటా 19.6 శాతం ఆపిల్ వాటా 19.3 శాతం కంటే స్వల్పంగా ఎక్కువగా ఉంది. ఆపిల్ సంస్థ 7.9 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. చైనాలో అమ్మకాల పరంగా హువావే మూడవ స్థానంలో ఉంది. ఇది మార్కెట్లో 9.2 శాతం వాటాతో 3.7 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఆ తర్వాత రెండు స్థానాలలో ఫిట్ బీట్ 7.3 శాతం వాటాతో 3.0 మిలియన్, శామ్ సంగ్ 6.1 శాతం మార్కెట్ వాటాతో 2.5 మిలియన్ యూనిట్లను సరఫరా చేసింది. కానాలిస్ రీసెర్చ్ ఎనలిస్ట్ సింథియా చెన్ మాట్లాడుతూ ఇలా అన్నారు. "షియోమీ తన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6ను త్వరగా విడుదల చేయడం ఒక తెలివైన చర్య. ఇది దాని మునుపటి కంటే పరికరం కంటే ఉత్తమమైనది" అని అన్నారు.
 

మరిన్ని వార్తలు