త్వరలో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల, జియో - షావోమీల మధ్య కీలక ఒప్పందం

22 Nov, 2021 15:03 IST|Sakshi

Xiaomi partnership with Jio for 5G phone: ఇండియన్‌ మార్కెట్‌లో సత్తా చాటుతున్న చైనా స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో విడుదల చేయబోయే స్మార్ట్‌ ఫోన్‌ కోసం రిలయన్స్‌ జియోతో ఒప్పందం కుదుర‍్చుకున్నట్లు ప్రకటించింది. 

ఇటీవల విడుదలైన క్యూ3 స్మార్ట్‌ ఫోన్‌ ఫలితాల్లో షావోమీ సంస్థ 22 శాతం షిప్‌మెంట్‌తో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఆ స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. మార్కెట్‌ షేర్‌ను పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వరుసగా 5జీ  స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస‍్తుంది. నవంబర్‌ 30న షావోమీ రెడ్‌ మీ నోట్‌ 11 సిరీస్‌ను రీబ్రాండ్‌ చేస్తూ..భారత్‌లో రెడ్‌ మీ నోట్‌ 11 టీ 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. 

ఫోన్‌ విడుదల నేపథ్యంలో..ఆ ఫోన్‌ పనితీరును గుర్తించేందుకు షావోమీ..,జియోతో చేతులు కలిపింది. రెడ్‌ మీ నోట్‌ 11టీ 5తో పాటు భవిష్యత్‌లో విడుదల కానున్న రెడ్‌ మీ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ల పనితీరు, యూజర్‌ ఫ్రెండ్లీగా ఉందా' అనే విషయాల్ని గుర్తించేందుకు రిలయన్స్‌ జియో ఆధ్వర్యంలో 5జీ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. వివిధ సెన్సార్ల ద్వారా ట్రయల్స్‌ నిర్వహించి 5జీ యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉందనే అంశాన్ని గుర్తిస్తారు.

రెడ్‌మీ నోట్‌ 11టీ ఫీచర్లు 
రెడ్‌ మీ నోట్‌ 11తరహాలో రెడ్‌ మీ నోట్‌ 11టీ మీడియా టెక్‌ డైమెన్సిటీ 810తో అందుబాటులో ఉంది. రియల్‌ మీ 8ఎస్‌ కాన్ఫిగరేషన్‌ల లాగే  6జీబీ ర్యామ్‌ 128జీబీ, 8జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ సౌకర్యం ఉంది. ఎంట్రీ లెవల్ కాన్ఫిగరేషన్ లలో వస్తున్న ఫోన్‌  ధర రూ. 17,999 ఉండగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ ఫీచర్లపై షావోమీ సంస్థ స్పందిస్తూ.. రెడ్‌మీ నోట్‌ 11 రీ బాండ్రే  ఈ రెడ్‌మీ నోట్‌ 11టీ స్మార్ట్‌ ఫోన్‌ అని తెలిపింది. కానీ ఇది స్విఫ్ట్‌డిస్‌ప్లే, స్పీడ్‌ ఛార్జింగ్‌, ర్యామ్‌ బూస్టర్‌ వంటి ఫీచర్లు ఉన్న నెక్ట్స్‌ జెనరేషన్‌ రేసర్‌ ఫోన్‌ అని తెలిపింది. 

చదవండి: షావోమీ మరో సంచలనం, మాట్లాడేందుకు కళ్ల జోడు తెస్తోంది

మరిన్ని వార్తలు