షియోమీ మరో అద్భుత ఆవిష్కరణ

23 Dec, 2020 20:41 IST|Sakshi

మొబైల్ కంపెనీలు యూజర్లను ఆకట్టుకోవడం కోసం రోజుకో టెక్నాలజీని తీసుకొస్తున్నాయి. ఇప్పటికే శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తుండగా.. ఎల్జీ, ఒప్పో వంటి ఇతర కంపెనీలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. మొబైల్ మార్కెట్ లో పోటీని తట్టుకునేందుకు షియోమీ కూడా మరో కొత్త టెక్నాలజీ మొబైల్ ని తీసుకురాబోతుంది. తాజాగా షావోమి సరౌండ్ డిస్‌ప్లే, పాప్‌-అప్ కెమెరా తో కొత్త ఫోన్‌ను తీసుకురాబోతుంది. వీటికి సంబంధించిన డిజైన్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎంఐ మిక్స్ ఆల్ఫా పేరుతో దీనిని మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు.(చదవండి: ఆపిల్, గూగుల్ కంపెనీలకు భారీ షాక్)

షియోమీ కాన్సెప్ట్ ఫోన్ పేటెంట్ లను లెట్స్‌గో డిజిటల్ టెక్ సంస్థ విడుదల చేసింది. షియోమీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ మేధో సంపత్తి కార్యాలయంలో భాగమైన ది హేగ్ బులెటిన్‌తో పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. 2020 డిసెంబర్ 18న స్మార్ట్‌ఫోన్ యొక్క 16 స్కెచ్‌లు బయటకి వచ్చాయి. ఈ 16 స్కెచ్‌లలో మొబైల్ ఫుల్ 360 డిగ్రీల ర్యాపారౌండ్ డిస్ప్లే కలిగి ఉంది. దీనితో పాటు పాప్‌-అప్‌ ఫీచర్‌తో ట్రిపుల్‌ కెమెరా, డ్యూయల్‌-ఎల్‌ఈడీ ఫ్లాష్‌ లైట్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ మొబైల్ పై భాగంలో పవర్ బటన్, సెకండరీ మైక్రోఫోన్ ఉన్నాయి. ఫోన్ దిగువ భాగంలో స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ తో పనిచేయనున్నట్లు సమాచారం. దీనిని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకువస్తారో అనే దానిపై ఇంకా సమాచారం లేదు.

మరిన్ని వార్తలు