Xiaomi: షావోమీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఒప్పో, వివో..!

23 Nov, 2021 20:36 IST|Sakshi

Xiaomi Revenue Fails To Meet Expectations As Competition From Oppo Vivo Intensifies: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమికి సమీప ప్రత్యర్థి స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలైన ఒప్పో, వివో భారీ షాక్‌ను ఇచ్చాయి. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లలో ఒప్పో, వివో ​కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ రావడంతో కంపెనీ ఆదాయ అంచనాలను చేరుకోవడంలో షావోమీ విఫలమైంది. కంపెనీ క్యూ3 రెవెన్యూలో కేవలం 0.4 శాతం వృద్దిని మాత్రమే నమోదు చేసింది. క్యూ3 రెవెన్యూలో షావోమీ 8.2 శాతం పెరుగుదలను సాధించింది. 

రిఫీనిటివ్‌ డేటా ప్రకారం...మూడు నెలల్లో (జూలై -సెప్టెంబర్) దాదాపు రూ. 90,910 కోట్ల విక్రయాలను షావోమీ జరిపింది. ఈ క్యూ3లో సుమారు రూ. 92,300 కోట్లను షావోమీ అంచనా వేసినట్లు తెలుస్తోంది. వన్-టైమ్ లాభాలు, నష్టాలను మినహాయించి, షావోమీ సుమారు రూ. 6,040 కోట్ల లాభాన్ని ఆర్జించింది. షావోమీ ఆదాయం కేవలం 0.4 శాతం పెరిగి రూ. 55,655 కోట్లకు చేరుకుంది.

రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం... చైనాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జూలై-సెప్టెంబర్ కాలంలో దాదాపు 5 శాతం మేర పడిపోయాయి. హువావేపై అమెరికా ఆంక్షలను విధించడంతో షావోమీ ఈ మేర లాభాలను పొందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీప ప్రత్యర్థులు ఒప్పో, వివో కంపెనీలు క్యూ3లో గడించిన వృద్ధిని షావోమీ పొందలేకపోయింది. చైనాలో షావోమీ షిప్‌మెంట్లు మూడో  త్రైమాసికంలో కేవలం 4 శాతం మేర పెరిగాయని కెనాలిస్ తెలిపింది. 
చదవండి: ప్ర‌పంచంలో అత్య‌ధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే!

>
మరిన్ని వార్తలు