షియోమీ నుంచి సరికొత్త టెక్నాలజీ

29 Jan, 2021 19:17 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ షియోమీ సరికొత్త వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ "ఎంఐ ఎయిర్ ఛార్జ్"ను ఆవిష్కరించింది. పేరుకు తగ్గట్టే ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీతో షియోమీ యూజర్లు కేబుల్స్, ప్యాడ్లు లేదా వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండ్‌లు లేకుండా స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఒకేసారి రిమోట్‌గా ఛార్జ్ చేయవచ్చు. "ఒకేసారి అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఎటుంవంటి కేబుల్ సహాయం లేకుండా ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఇది, వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో పెను మార్పులను తీసుకొస్తుందని ఆశిస్తున్నాం"అని షియోమి తన ట్విటర్ లో తెలిపింది.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల)
 

ఈ వైర్‌లెస్ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ షియోమీ స్పేస్ పొజిషనింగ్, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసినట్లు షియోమీ సీఈఓ తెలిపారు. దీనిలోని 144 యాంటెన్నాలతో కూడిన ఫేస్ కంట్రోల్ అర్రే మిల్లీమీటర్ తరంగాలు నేరుగా బీమ్‌ఫార్మింగ్ ద్వారా ఛార్జింగ్ అవసరమయ్యే స్మార్ట్‌ఫోన్‌కు వెళతాయి. దీనిలోని బిల్ట్ ఇన్ 5- ఫేస్ ఇంటర్ఫేస్ యాంటెన్నా మనం ఛార్జ్ చేయాలనుకునే డివైజ్‌ను ఖచ్చితంగా గుర్తించగలదు. ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ బేస్ మోడల్ ద్వారా 5వాట్ కి సపోర్ట్ చేసే అనేక పరికరాలను ఒకేసారి ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది మాయ కాదని ఇది ఒక సైన్స్ అద్భుత సృష్టి అని వీడియో చివరలో పేర్కొంది. ఇది వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది.

మరిన్ని వార్తలు