కళ్లు చెదిరే ఆఫర్‌, ఈ బైక్‌ కొంటే రూ.1లక్ష వరకు..!

14 Aug, 2021 09:03 IST|Sakshi

బైక్‌ లవర్స్‌కు యమహా ఇండియా మోటార్‌ కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా పలు వాహనాలపై గిఫ్ట్‌ ఓచర్లు, రూ.1లక్ష విలువైన బంపర్‌ ఫ్రైజ్‌లను అందిస్తున్నట్లు  యమహా ప్రకటించింది.

  

కరోనా కారణంగా చతికిల పడ్డ ఆటోమోబైల్‌ సంస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కష్టమర్లు లేక ఇబ్బందులు పడ్డ పలు ఆటో మొబైల్‌ సంస్థలు ఆఫర్లు ప్రకటించి సేల్స్‌ను పెంచుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్‌ఐ, యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్‌ఐ,  నాన్‌ ఐబ్రిడ్‌ వెహికల్‌ యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ వెహికల్స్‌ ను ఆగస్ట్‌ 31లోగా కొనుగోలు చేస్తే రూ.2,999 గిఫ్ట్‌ ఓచర్స్‌, రూ.20వేల వరకు అడిషనల్‌ బెన్‌ ఫిట్స్‌ పొందవచ్చని యమహా ఇండియా మోటార్‌ ప్రకటించింది. 

దేశ వ్యాప్తంగా ఒక్క తమిళనాడు మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్‌ఐ, యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్‌ఐ,  నాన్‌ ఐబ్రిడ్‌ వెహికల్‌ యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ వెహికల్స్‌ కొనుగోలు చేసిన వాహనదారులకు రూ.3,876 ఇన్స్యూరెన్స్‌ బెన్‌ ఫిట్స్‌, రూ.999కే లో డౌన్‌ పేమెంట్స్‌ తో బైక్‌ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు రూ. 2,999 విలువైన గిఫ్ట్‌ను అందిస్తుంది. తమిళనాడులో యమహా బైక్‌ కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా రూ.30వేల విలువైన గిఫ్ట్‌ తో పాటు బంపర్‌ ఆఫర్‌ కింద  రూ.1లక్ష రూపాయల్ని సొంతం చేసుకోవడమే కాదు..అడిషనల్‌ బెన్‌ ఫిట్స్‌ కింద రూ.20 వేలు దక‍్కించుకోవచ్చు. ఇక మిగిలిన అన్నీ మోడల్స్‌ పై రూ. 2,999 విలువైన బహుమతులు, రూ.20వేల  అడిషనల్‌ బెన్‌ ఫిట్స్‌ను పొందవచ్చు. 

చదవండి: ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది

>
మరిన్ని వార్తలు