అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్

1 Jun, 2021 18:29 IST|Sakshi

యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ గుర్తుందా? జపనీస్ ద్విచక్ర వాహన తయారీ దారి దిగ్గజం కొన్ని సంవత్సరాల క్రితం టోక్యో మోటార్ షోలో 2019 ఎడిషన్ సందర్భంగా ఈ బైక్ ప్రోటో టైపుని విడుదల చేసి ఆశ్చర్య పరిచింది. సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి సిద్దం అవుతుంది. యమహా మోటార్ త్వరలో తీసుకురాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ నమూనాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ పేటెంట్లను కూడా దాఖలు చేసిన మాట వాస్తవం. 

లీకైన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ పేటెంట్ చిత్రాలను పరిశీలిస్తే సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా ఉంది. డిజైన్ పరంగా అన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంటే చాలా బాగుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ చిత్రాలు ఆన్​లైన్​లో వైరల్​ అవుతున్నాయి. దీని ముందు భాగంలో పెద్ద హెడ్‌ల్యాంప్, వెనుక భాగంలో స్ట్రీమ్లైన్డ్ డిజైన్‌ వంటివి దీన్ని ప్రీమియం స్కూటర్​గా నిలుపుతాయి. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. యమహా రాబోయే ఈ–స్కూటర్‌లో ఆల్-ఎల్ఈడి లైటింగ్ సెటప్, ఫుల్​ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన వాటిని అందిస్తుంది.

ఇక్కడ గమనించదగ్గ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీని బ్యాటరీని రైడర్​ లెగ్స్​ మధ్యలో చేర్చారు. ఇక స్కూటర్ మోటారును బ్యాటరీ వెనుక అమర్చారు. ఇవి డిస్క్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంటాయి. E01 ఎలక్ట్రిక్ స్కూటర్ రిటైల్ కోసం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయంపై యమహా స్పష్టతనివ్వలేదు. అంతర్జాతీయ మార్కెట్(ల)లో స్కూటర్ ప్రారంభించబడటానికి ఎక్కువ సమయం పట్టదని అంచనా. నిజంగా చెప్పాలంటే, రాబోయే దశాబ్ద కాలం మాత్రం ఇండియాదే అనిపిస్తుంది. భారత మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాల రోజు రోజుకి పెరిగిపోతుంది.

చదవండి: రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధర

>
మరిన్ని వార్తలు