Rapido: రాపిడోలో భారీగా ఇన్వెస్ట్‌చేసిన యమహా కంపెనీ..!

16 Aug, 2021 20:47 IST|Sakshi

జపనీస్ మోటార్‌సైకిల్ తయారీదారు యమహా బెంగుళూరుకు చెందిన బైక్ టాక్సీ ప్లాట్‌ఫాం రాపిడోలో భారీగా పెట్టుబడులను పెట్టింది. సుమారు 52 మిలియన్‌ డాలర్లను (రూ. 385 కోట్లు) ఫండింగ్‌ను యమహా అందించింది. ఈ నిధులను వచ్చే 18 నెలల్లో 50 మిలియన్ల మంది కొత్త వినియోగదారుల కోసం ఉపయోగించాలని రాపిడో యోచిస్తోంది. యమహా అందించిన నిధుల్లో కొంతభాగం అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టడం కోసం, దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన చేయడం కోసం రాపిడో ఉయోగించనుంది.

రాపిడోలో ఫండింగ్‌ చేయడం కోసం నిర్వహించిన రౌండ్స్‌లో షెల్ వెంచర్స్, క్రెడ్‌ వ్యవస్థాపకులు కునాల్ షా, స్పాటిఫై ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమర్‌జిత్ సింగ్ బాత్రా,  పాజిటివ్ మూవ్స్ కన్సల్టింగ్ కంపెనీలు పాల్గోన్నాయి. ఇప్పటికే రాపిడోలో ఇన్వెస్ట్‌చేసిన హీరో గ్రూప్‌ పవన్‌ ముంజల్‌, వెస్ట్‌బ్రిడ్జ్‌, నెక్సస్‌ వెంచర్స్‌ కూడా పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 100 నగరాల్లో రాపిడో అతి పెద్ద ట్యాక్సీ ప్లేయర్‌గా నిలుస్తోందని కంపెనీ రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంకా అన్నారు.

రాపిడో ఇప్పటివరకు 130 మిలియన్‌ డాలర్లను వెస్ట్‌బ్రిడ్జ్‌ ఏఐఎఫ్‌, నెక్సస్‌ వెంచర్స్‌, సాబెర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, స్కైకాచర్‌ ఎల్‌ఎల్‌సీ, బీఎస్‌ ఫండ్‌, ఇంటిగ్రేటెడ్‌ గ్రోత్‌ క్యాపిటల్‌ కంపెనీల నుంచి నిధులను సేకరించింది.  రాపిడో బైక్‌ ట్సాక్సీ సర్వీస్‌లను 2015లో అరవింద్‌ సంకా, పవన్‌ గుంటుపల్లి, ఎస్‌ఆర్‌ రిషికేశ్‌ స్థాపించారు. 

మరిన్ని వార్తలు