యమహా కొత్త స్కూటర్‌.. ఏరోక్స్‌155

22 Sep, 2021 04:44 IST|Sakshi

ధర రూ.1.29 లక్షలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ యమహా మోటార్‌ ఇండియా సరికొత్తగా ఏరోక్స్‌–155 స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.29 లక్షలు. 15 పీఎస్‌ పవర్, సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో 155 సీసీ ఇంజిన్, స్మార్ట్‌ మోటార్‌ జనరేటర్‌ సిస్టమ్, సింగిల్‌ చానల్‌ ఏబీఎస్, 14 అంగుళాల టైర్లు, బ్లూటూత్, 24.5 లీటర్‌ అండర్‌ సీట్‌ స్టోరేజ్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ వంటివి పొందుపరిచారు.

కంపెనీ ఆధునీకరించిన వైజెడ్‌ఎఫ్‌–ఆర్‌15 బైక్‌ను సైతం ఆవిష్కరించింది. దీని ధర రూ.1.67 లక్షల నుంచి ప్రారంభం. 155 సీసీ, 4 స్ట్రోక్, 18.4 పీఎస్‌ పవర్‌తో లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్, 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్, ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్, క్విక్‌ షిఫ్టర్, బ్లూటూత్, ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ వంటి హంగులు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు