యమహా నుంచి కొత్త ఎడిషన్‌ బైక్‌

24 Aug, 2021 02:57 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ యమహా.. ఎంటీ15 మాన్‌స్టర్‌ ఎనర్జీ యమహా మోటోజీపీ ఎడిషన్‌ బైక్‌ను ప్రవేశపెట్టింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.1.48 లక్షలు. ఫ్యూయల్‌  ట్యాంక్‌పై యమహా మోటోజీపీ బ్రాండింగ్‌ ఉంటుంది. 155 సీసీ, ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్, లిక్విడ్‌ కూల్డ్, 4 స్ట్రోక్, ఎస్‌వోహెచ్‌సీ, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌తో 4 వాల్వ్‌ ఇంజన్‌ను పొందుపరిచారు. 10,000 ఆర్‌పీఎంతో 18.5 పీఎస్, 13.9 ఎన్‌ఎం  టార్క్‌ ఉంది. సైడ్‌ స్టాండ్‌ ఇంజన్‌ కట్‌ ఆఫ్, సింగిల్‌ చానల్‌ ఏబీఎస్, వేరియబుల్‌ వాల్వ్‌ యాక్చువేషన్‌ సిస్టమ్‌ వంటి హంగులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు