Yamaha Rx 100: ఎన్ని ఉన్నా ఈ బైక్‌ క్రేజ్‌ వేరబ్బా.. యమహా నుంచి ఆ మోడల్‌ మళ్లీ వస్తోంది!

23 Jul, 2022 16:02 IST|Sakshi

యూత్‌లో బైక్‌లకు ఉన్న క్రేజ్‌ వేరు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ యుగంలో బోలెడన్ని బైకులు దర్శనమిస్తున్నాయి. అయితే ఎన్ని ఉన్నా మార్కెట్లో యమహా ఆర్‌ఎక్స్‌ 100కి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. 90 దశకంలో యువతని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఈ బైక్‌లను నిలిపేసి 25 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అవి రోడ్లపై దర్శనమిస్తున్నాయి. అయితే ఆ మోడల్ బైక్‌ కోసం కలలు కనే వారి కోసం తాజాగా యమహా కంపెనీ ఓ శుభవార్త తీసుకువచ్చింది. ఆర్ఎక్స్ 100 బైక్‌ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

యువత కలల బైక్‌ రానుంది
యమహా ఇండియా చైర్మన్‌ ఐషిన్ చిహానా మాట్లాడుతూ.. కొత్తగా రాబోతున్న యమహా RX100 ఆధునిక డిజైన్ , స్టైలిష్‌ లుక్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ బైక్‌ పాత మోడల్‌కి మార్కెట్లో ఇప్పటికీ డిమాండ్‌ ఉంది, వాటిని దృష్టిలో పెట్టుకుని బైక్‌ లవర్స్‌ని ఆకట్టుకునేలా డిజైన్‌, తయారీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2026 తర్వాత మార్కెట్లోకి కొత్త వెర్షన్‌ ఆర్‌ఎక్స్‌100 బైక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే వచ్చే మూడేళ్లలో యమహా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోందని చిహానా పేర్కొన్నారు.

ప్రస్తుతానికి, రాబోయే యమహా ఎలక్ట్రిక్ స్కూటర్‌లు టెస్టింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం యమహాకు భారత్‌లో గ్రేటర్‌ నోయిడా, చెన్నైలో ప్రొడక్షన్‌ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే వాటితో 30 దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు.  కాగా యమహా కంపెనీ 1985 నుంచి ఉత్పత్తి ప్రారంభించి ఆర్‌ఎక్స్‌100బైక్‌ను 1996 వరకు కొనసాగించారు.

చదవండి: 2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి

మరిన్ని వార్తలు