యమహా త్రీ వీల్‌ స్కూటర్.. కొత్త లుక్ & అదిరిపోయే ఫీచర్స్

17 Feb, 2023 17:04 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్లో మూడు చక్రాల స్కూటర్లు చాలా అరుదు, అయితే ప్రపంచం ప్రగతి మార్గంలో పరుగులు పెడుతున్న తరుణంలో ఆధునిక వాహనాల ఉత్పత్తి, వినియోగం చాలా అవసరం. ఇందులో భాగంగా యమహా కంపెనీ ఇప్పుడు జపనీస్ మార్కెట్లో ట్రైసిటీ స్కూటర్ విడుదల చేసింది.

యమహా విడుదల చేసిన ట్రైసిటీ స్కూటర్ 125 సీసీ, 155 సీసీ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. నిజానికి కంపెనీ ఇలాంటి స్కూటర్ 2014 లో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసినప్పటికీ భారతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురాలేదు. ఇది సాధారణ స్కూటర్ మాదిరిగా ఉన్నప్పటికీ ముందు భాగంలో రెండు చక్రాలు, వెనుక ఒక చక్రం పొందుతుంది.

ట్రైసిటీ స్కూటర్ LED డేటైమ్ రన్నింగ్ లైట్స్, సెంటర్ సెట్ LED హెడ్‌లైట్, LCD సెంటర్ కన్సోల్‌ వంటి వాటితో పాటు సింగిల్ సీట్‌తో ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ రైల్ పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్, రెండు వైపులా డిస్క్ బ్రేకులు, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక డ్యూయెల్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంటుంది.

ట్రైసిటీ స్కూటర్లోని 125 సీసీ ఇంజిన్ 12.06 బిహెచ్‌పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, అదే సమయంలో 155 సీసీ ఇంజిన్ 14.88 బిహెచ్‌పి పవర్ మరియు 14 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

జపనీస్ మార్కెట్లో విడుదలైన ట్రైసిటీ 125 స్కూటర్ 125 ధర రూ. 4,95,000 యెన్లు (సుమారు రూ. 3.10 లక్షలు) 155 స్కూటర్ ధర 5,56,500 యెన్లు (సుమారు రూ. 3.54 లక్షలు). డెలివరీలు ఫిబ్రవరి, ఏప్రిల్ సమయంలో మొదలవుతాయి. ఈ మోడల్ స్కూటర్ మన దేశంలో విడుదలవుతుందా.. లేదా అనే విషయాన్నీ యమహా ధ్రువీకరించలేదు.

మరిన్ని వార్తలు