నెలాఖరులోగా మొండి పద్దుల విక్రయం పూర్తి

5 Nov, 2022 06:10 IST|Sakshi

యస్‌ బ్యాంక్‌ సీఈవో ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడి

ముంబై: దాదాపు రూ. 48,000 కోట్ల మొండి పద్దులను అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ) జేసీ ఫ్లవర్స్‌కు విక్రయించే ప్రక్రియ నవంబర్‌ నెలాఖరుకి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు యస్‌ బ్యాంక్‌ సీఈవో ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. దీనితో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) నిష్పత్తి 12.89 శాతం నుంచి 2 శాతం లోపునకు దిగి రానుంది. మొత్తం పద్దులకు గాను రూ. 11,183 కోట్లు  యస్‌ బ్యాంక్‌కు జేసీ ఫ్లవర్స్‌ చెల్లించనుంది.

ఇది సుమారు 23 శాతం రికవరీకి సమానం. మరోవైపు, డీల్‌ ప్రకారం ఏఆర్‌సీలో యస్‌ బ్యాంక్‌ 9.9 శాతం వాటాలు తీసుకోనున్నట్లు, ఆర్‌బీఐ అనుమతితో దీన్ని తదుపరి 20 శాతానికి పెంచుకోనున్నట్లు ఎఫ్‌ఐబీఏసీ 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుమార్‌ వివరించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, భారతీయ బ్యాంకుల అసోసియేషన్‌ (ఐబీఏ) కలిసి దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి.  

మరిన్ని వార్తలు