యస్‌బ్యాంకు భారీ ఊరట: రుణాల్లో 14 శాతం వృద్ధి 

6 Jul, 2022 15:52 IST|Sakshi

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లోన్లు 7 శాతం అప్‌ 

న్యూఢిల్లీ: గతేడాది జూన్‌ ఆఖరుతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌ ఆఖరు నాటికి ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ రుణాల వ్యాపారం 14 శాతం వృద్ధి చెంది రూ. 1,63,654 కోట్ల నుంచి రూ. 1,86,598 కోట్లకు చేరింది. జూన్‌ క్వార్టర్‌లో స్థూల రిటైల్‌ రుణాలు రెట్టింపై రూ. 5,006 కోట్ల నుంచి రూ. 11,431 కోట్లకు పెరిగాయి. ఇక డిపాజిట్లు 18.3 శాతం వృద్ధితో రూ. 1,63,295 కోట్ల నుంచి రూ. 1,93,241 కోట్లకు చేరాయి.

అయితే, మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం తగ్గాయి. ఇవి ప్రొవిజనల్‌ గణాంకాలని, త్వరలోనే జూన్‌ త్రైమాసిక ఆర్తిక ఫలితాలను ప్రకటించ నున్నామని బ్యాంక్‌ తెలిపింది. అటు, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కూడా తమ వ్యాపార గణాంకాలను స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం డిపాజిట్లు 6 శాతం పెరిగి రూ. 79,217 కోట్లకు చేరినట్లు పేర్కొంది. రిటైల్‌ రుణాలు వార్షికంగా 5 శాతం, సీక్వెన్షియల్‌గా 3 శాతం క్షీణించాయని వివరించింది. గత కొద్ది త్రైమాసికాలుగా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో వ్యాపారం కూడా పుంజుకుంటోందని ఆర్‌బీఎల్‌ బ్యాంకు పేర్కొంది.   
 

మరిన్ని వార్తలు