జియో నెక్ట్స్‌ ఫోన్ కొంటున్నారా.. అయితే ఇవి కూడా చూడండి!

31 Oct, 2021 15:46 IST|Sakshi

దీపావళి పండుగా సందర్భంగా రిలయన్స్ జియో సంస్థ ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో ఫోన్‌ నెక్ట్స్‌ విడుదల చేయనున్నట్లు కంపెనీ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ ఎప్పుడో లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ, చిప్ కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్‌ వెంటనే అమ్మకానికి రాలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29న జియో సంస్థ ఫోన్‌ ఫీచర్లు, ధరల్ని అధికారికంగా ప్రకటించింది. జియో ప్రకటించిన ఫోన్ ధర రూ.6,499 చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

అలాగే, ఈఎమ్ఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడే చాలా మంది జియో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ ఈఎమ్ఐ ఆప్షన్ కింద ఎంచుకోవాలంటే ముందుగా రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని వారు ఇచ్చిన ఈఎమ్ఐ ఆప్షన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకుంటే రెడ్​మీ 9ఏ, రియల్‌మీ సీ11 కంటే ఎక్కువ అవుతున్నట్లు పేర్కొంటున్నారు.

(చదవండి: గ్రిడ్ 2.0 ఈవీ స్టేషన్స్ లాంచ్ చేసిన అథర్ ఎనర్జీ)

ట్విటర్ వేదికగా జియో సంస్థను ప్రశ్నిస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ కంటే ఈ రెండింటిలో ఉత్తమ స్పెసిఫికేషన్స్ ఉన్నట్లు తెలుపుతున్నారు. ప్రస్తుతం రెడ్​మీ 9ఏ స్మార్ట్ ఫోన్ ధర రూ.6,999గా ఉంది. అదే రియల్‌మీ సీ11 ధర రూ.6799గా ఉంది. మీరు గనుక జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇవి దాని కంటే ఉత్తమ స్పెసిఫికేషన్స్ ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. రెడ్​మీ 9ఏ, రియల్‌మీ సీ11, జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.  

జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్: 

  • 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
  • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్
  • 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
  • 3,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
  • 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా
  • 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
  • స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ 
  • ఆండ్రాయిడ్ ప్రగతి ఓఎస్
  • ధర - రూ.6,499

రెడ్​మీ 9ఏ ఫీచర్స్:  

  • 6.53 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
  • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్
  • 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
  • 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
  • 5 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా
  • 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
  • ధర - రూ.6,999

రియల్‌మీ సీ11:

  • 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
  • క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్
  • 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
  • 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
  • 5 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా
  • 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
  • ధర - రూ.6,799
     
మరిన్ని వార్తలు