అడ్రస్‌ ప్రూఫ్‌ లేకున్నా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు

4 Aug, 2021 12:48 IST|Sakshi

మీరు ఇల్లు మారారా? ఆధార్‌ కార్డ్‌లో అడ్రస్‌ ఛేంజ్‌ చేయాలా? అడ్రస్‌ ఛేంజ్‌ కోసం మీ దగ్గర ఫ్రూప్స్‌ ఏమీ లేవా? అయితేనేం తాజా అప్‌డేట్‌తో  ఆ అడ్రస్‌ ఫ్రూప్‌ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. ఇకపై మీకుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డ్‌, కాంటాక్ట్‌ నెంబర్‌తో ఆధార్‌ అడ్రస్‌ మార్చుకునేలా  యుఐడీఎఐ అవకాశం కల్పించింది. 

వాస్తవానికి ఆధార్‌ కార్డ్‌లో అడ్రస్‌ వివరాల్ని మార్చాలంటే తప్పని సరిగా  యుఐడీఎఐ (Unique Identification Authority of India)  వెబ్ సైట్ లో పేర్కొన్న పాస్ పోర్ట్, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్ల కాపీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.  కానీ వాటి అవసరం లేకుండా ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్‌, మీ బంధువుల ఆధార్డ్‌తో  అడ్రస్‌ మార్చుకోవచ్చు.

 మీ ఆధార్‌ కార్డ్‌ లో అడ్రస్‌ ను ఇలా మార్చుకోండి

♦ ముందుగా ఈ https://uidai.gov.in/ లింకును ఓపెన్ చేయాలి. 

♦ లింక్‌ ఓపెన్‌ చేసి మీ కుటుంబసభ్యుల ఆధార్‌ కార్డ్‌తో లాగిన్‌ అవ్వాలి

♦ లాగిన్‌ తర్వాత ఆధార్‌ కార్డ్‌, కాంటాక్ట్‌ నెంబర్‌ వెరిఫై చేసుకోవాలి. 

♦ వెరిఫైలో మీ ఆధార్‌ కార్డ్‌ అడ్రస్‌ మార్చుకునేలా అప్రూవల్‌ లింక్‌  వస్తుంది.

♦ ఇప్పుడు ఆ లింక్‌ను ఓపెన్‌ చేసి మీరు మార్చుకోవాలనుకున్న అడ్రస్‌ వివరాల్ని ఎంటర్‌ చేయాలి.

♦ రిక్వెస్ట్‌ సమయంలో మీ కాంటాక్ట్‌ నెంబర్‌ ను వెరిఫై చేసుకోవాలి. 

♦ అనంతరం మీ ఆధార్‌ అడ్రస్‌ మార్చుకునేందుకు  28 అంకెల సర్వీస్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌ (ఎస్‌ఆర్‌ఎన్‌) ఎంటర్‌ చేయాలి. 

♦ ఎస్‌ఆర్‌ఎన్‌ నెంబర్‌ ఎంటర్‌ తర్వాత మీ అడ్రస్‌ మార‍్చుకునేలా రిక్వెస్ట్‌ను పూర్తి చేయాలి. 

♦ ఈ ప్రాసెస్‌ అంతా కంప్లీట్‌ చేసిన తరువాత ఓ పిన్‌ నెంబర్‌  మీకు పోస్ట్‌ ద్వారా మీరు మార్చుకున్న అడ్రస్‌కు వస్తుంది. 

♦ ఆ సీక్రెడ్‌ కోడ్‌ ను ఎంటర్‌ చేసి చివరిగా మీ ఆధార్‌ కొత్త  ఇంటి అడ్రస్‌ రివ్యూ  ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి

♦ గడువు పూర‍్తయిన తర్వాత మీరు కావాలనుకున్న అడ్రస్‌ పేరుమీద మీ ఆధార్‌ అప్‌ డేట్‌ అవుతుంది

మరిన్ని వార్తలు