ప‌న్ను చెల్లింపు దారుల‌కు శుభ‌వార్త‌!! రూ.ల‌క్ష‌వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవ‌డం ఎలానో మీకు తెలుసా?

16 Feb, 2022 13:30 IST|Sakshi

మీరు 2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రంలో ట్యాక్స్ చెల్లిస్తున్నారా? ఈ సంద‌ర్భంగా మీరు ట్యాక్స్ సేవ్ చేయాల‌ని అనుకుంటున్నారా? అయితే మీకో శుభ‌వార్త‌. సెక్ష‌న్ 80సీ కాకుండా సెక్ష‌న్ 80డీ కింద అద‌నంగా మ‌రో రూ.1ల‌క్ష వ‌ర‌కు అదా చేసుకోవ‌చ్చ‌ని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. 

2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించ‌డానికి 2022 మార్చి,31చివ‌రి తేదీ. అయితే ఈ ట్యాక్స్ చెల్లింపు సంద‌ర్భంగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి వ‌ర‌కు ప‌న్నును ఆదా చేసుకోవ‌చ్చు. ఇప్పుడు సెక్షన్ 80సీతో పాటు సెక్షన్ 80డీ కింద పన్ను ఆదా చేసుకోవ‌చ్చు. సెక్షన్ 80డీలో వయస్సు ఆధారంగా నిర్దిష్ట పరిమితి వరకు మీరు తీసుకున్నహెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై సెక్ష‌న్ 80సీ ప‌రిమితి కంటే ఎక్కువ మీకు అద‌న‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాల్ని పొంద‌వ‌చ్చు.    

మీరు,మీ తల్లిదండ్రులు 60ఏళ్లు పైబడిన వారు అంటే సీనియర్ సిటిజన్లు అయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవ‌డం ద్వారా మీరు రూ.1లక్ష వరకు ఆదాయపు పన్నును ఆదా చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అనేకం ఉన్నాయి.

మీరు ఎలాంటి ఇన్స్యూరెన్స్ పాల‌సీ తీసుకున్నా ప‌న్ను ఆదా చేసుకునేందుకు ఆదాయపు పన్ను చట్టం 961లోని సెక్షన్ 80డీ కిందకు వస్తుంది. ఇందులో గరిష్ట పన్ను ప్రయోజనం రూ.25,000 లేదా రూ.50,000 మాత్రమే. అయితే వాస్తవ పన్ను ప్రయోజనం ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. ఇది మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు నిర్దిష్ట వయస్సు కంటే ఎక్కువ ఉంటే మీరు పొందే మొత్తం మినహాయింపు సుమారు రూ.ల‌క్ష‌రూపాయ‌లు.  

ఆరోగ్య బీమా ప్రీమియం 60 ఏళ్లలోపు వ్యక్తులకు రూ. 25,000 వరకు, 60 ఏళ్లు పైబడిన వారికి రూ. 50,000 వరకు పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం (కనీసం 60 సంవత్సరాలు) ఆరోగ్య బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మొత్తం పన్ను ప్రయోజనాన్ని రూ.75,000 వరకు పొందవచ్చు. మీరు,  మీ తల్లిదండ్రులు ఇద్దరూ 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారైతే, గరిష్టంగా రూ.1,00,000 వరకు మినహాయింపు పొందవచ్చు” అని  క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ,సీఈఓ పంకజ్ అరోరా చెప్పారు. చెల్లించిన ప్రీమియం మీ స్థూల మొత్తం ఆదాయాన్ని సమాన మొత్తానికి తీసుకువస్తుంది. తద్వారా మీ పన్ను బాధ్యత తగ్గుతుంది.

మరిన్ని వార్తలు